Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Fire Accident: నాంపల్లి క్రిమినల్ కోర్టులో అగ్ని ప్రమాదం

Fire Accident: నాంపల్లి క్రిమినల్ కోర్టులో అగ్ని ప్రమాదం

NTV Telugu 3 weeks ago

Fire Accident: హైదరాబాద్‌లోని నాంపల్లి క్రిమినల్ కోర్టు భవనంలో సోమవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కోర్టు భవనం మూడవ అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడ ఉన్న సిబ్బంది అప్రమత్తమయ్యారు.

ఘటన సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులు రంగంలోకి దిగారు.

అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశానికి రెండు ఫైర్ ఇంజన్లు హుటాహుటిన చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. అగ్నిమాపక సిబ్బంది వేగంగా స్పందించడంతో మంటలు ఇతర అంతస్తులకు వ్యాపించకుండా అడ్డుకోగలిగారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు అధికారులు తెలిపారు. ప్రాథమిక విచారణలో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్నిప్రమాదం సంభవించినట్లు అధికారులు భావిస్తున్నారు. ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని వెల్లడించారు. అగ్నిప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, ఆస్తి నష్టం ఎంత మేరకు జరిగిందనే అంశాలపై అధికారులు విచారణ చేపట్టనున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu