Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Green Chillies Storage Tips: ఈ సింపుల్ ట్రిక్‌ చాలు.. పచ్చిమిరపకాయలు వారాల తరబడి ఫ్రెష్‌గా ఉంటాయి

Green Chillies Storage Tips: ఈ సింపుల్ ట్రిక్‌ చాలు.. పచ్చిమిరపకాయలు వారాల తరబడి ఫ్రెష్‌గా ఉంటాయి

NTV Telugu 1 week ago

Green Chillies Storage Tips: పచ్చిమిరపకాయలు దాదాపు ప్రతి భారతీయ వంటింట్లో రోజూ ఉపయోగించే ముఖ్యమైన పదార్థం. అయితే మార్కెట్ నుంచి తాజాగా కొనుగోలు చేసిన మిరపకాయలు ఫ్రిజ్‌లో పెట్టిన రెండు మూడు రోజుల్లోనే వాడిపోవడం లేదా కుళ్లిపోవడం చాలా మందికి ఎదురయ్యే సమస్య.

దీనికి ప్రధాన కారణం వాతావరణం మాత్రమే కాదు, వాటిని సరైన పద్ధతిలో నిల్వ చేయకపోవడం కూడా.. అసలు, పచ్చిమిరపకాయలు త్వరగా పాడవడానికి ప్రధాన కారణం తేమ. మిరపకాయలపై నీరు ఉండటం లేదా తడిగా ఫ్రిజ్‌లో నిల్వ చేయడం వల్ల బూజు, బ్యాక్టీరియా వేగంగా పెరుగుతాయి. ఫలితంగా అవి మెత్తబడటం, రంగు మారడం, కుళ్లిపోవడం జరుగుతుంది. అందుకే నిల్వ చేసే ముందు అవి పూర్తిగా పొడిగా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం.

ఎక్కువాలం తాజాగా ఉండాలంటే..?

మిరపకాయలను ఎక్కువకాలం తాజాగా ఉంచాలంటే ముందుగా వాటిలో మెత్తబడినవి, మచ్చలు ఉన్నవి లేదా పాడైపోయినవిని వేరు చేయాలి. అనంతరం అన్ని మిరపకాయల కాడలను తొలగించాలి. తర్వాత శుభ్రమైన, పొడి, గాలి చొరబడని డబ్బా తీసుకుని అడుగున టిష్యూ పేపర్ లేదా పేపర్ టవల్ పరచాలి. దానిపై మిరపకాయలను వేసి, మళ్లీ మరో టిష్యూ పేపర్‌తో కప్పి మూత పెట్టాలి. టిష్యూ పేపర్ అదనపు తేమను పీల్చుకోవడంతో మిరపకాయలు ఎక్కువకాలం తాజాగా ఉంటాయి. టిష్యూ పేపర్ తడిగా మారితే వెంటనే మార్చడం మంచిది.

పెద్ద పొరపాటు..

చాలామంది చేసే సాధారణ పొరపాటు ఏమిటంటే, మిరపకాయలను కడిగిన వెంటనే ఫ్రిజ్‌లో పెట్టడం. ఇలా చేయడం వల్ల అవి త్వరగా పాడవుతాయి. ఒకవేళ కడగాల్సి వస్తే, పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే నిల్వ చేయాలి. అలాగే ఫ్రిజ్‌లో తేమ తక్కువగా ఉండే ప్రదేశంలో ఉంచడం మంచిది. మొత్తంగా సరైన పద్ధతిలో నిల్వ చేస్తే పచ్చిమిరపకాయలు చాలా వారాల పాటు తాజాగా ఉండే అవకాశం ఉంది. వాటి నాణ్యత, ఫ్రిజ్ ఉష్ణోగ్రత, నిల్వ చేసే విధానాన్ని బట్టి ఈ కాలం మారవచ్చు. చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మిరపకాయలను తరచూ కొనాల్సిన అవసరం తగ్గి, వంటింట్లో ఎప్పుడూ తాజా మిరపకాయలు అందుబాటులో ఉంటాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu