Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
GST Collections July 2026: దేశ ఆర్థిక వ్యవస్థకు బిగ్ బూస్ట్.. జూలైలో GST వసూళ్లు రూ.2.11 లక్షల కోట్లు

GST Collections July 2026: దేశ ఆర్థిక వ్యవస్థకు బిగ్ బూస్ట్.. జూలైలో GST వసూళ్లు రూ.2.11 లక్షల కోట్లు

NTV Telugu 2 weeks ago

GST Collections July 2026: దేశంలో వస్తు సేవల పన్ను (GST) వసూళ్లు మరోసారి బలమైన వృద్ధిని నమోదు చేశాయి. 2026 జూలైలో స్థూల GST వసూళ్లు గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 15.4 శాతం పెరిగి రూ.2.11 లక్షల కోట్లకు చేరుకున్నాయి.

ఆగస్టు 1న కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది. జూలై నెలలో నమోదైన మొత్తం GST ఆదాయంలో Central GST (CGST): రూ.39,835 కోట్లు, State GST (SGST): రూ.47,881 కోట్లు, Integrated GST (IGST): సుమారు రూ.1.23 లక్షల కోట్లు వంటి వాటా ఉంది. GST వసూళ్లలో కొనసాగుతున్న వృద్ధి దేశ ఆర్థిక కార్యకలాపాల్లో స్థిరమైన ఊపును సూచిస్తోందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.

అక్టోబర్ 1 నుంచి FD నిబంధనల్లో మార్పులు

మరోవైపు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఫిక్స్‌డ్ డిపాజిట్లకు (FDs) సంబంధించిన నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. ఈ మార్పులు 2026 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. RBI జారీ చేసిన Reserve Bank of India (Commercial Banks – Interest Rate on Deposits) Second Amendment Directions, 2026 ద్వారా కొత్త నిబంధనలను వెల్లడించింది.

అన్ని బ్రాంచ్‌లలో ఒకే వడ్డీ రేటు

కొత్త నిబంధనల ప్రకారం, ఒకే రోజున ఒకే మొత్తానికి సంబంధించిన డిపాజిట్లపై బ్యాంకులు తమ అన్ని శాఖల్లో ఒకే విధమైన వడ్డీ రేటును అందించాల్సి ఉంటుంది. అదే విధంగా, ఒకే మొత్తంలో డిపాజిట్‌ను ఒకే రోజున స్వీకరించినప్పుడు, కస్టమర్ల మధ్య వడ్డీ చెల్లింపులో వివక్ష ఉండకూడదని RBI స్పష్టం చేసింది. ఈ నిబంధనలు సాధారణ డిపాజిట్లతో పాటు బల్క్ డిపాజిట్లకు కూడా వర్తిస్తాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu