Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
GV Prakash : యాక్టర్, మ్యూజిక్ డైరెక్టర్‌గా వరుస ప్రాజెక్టులు.. ఇండియాలోనే ఒక్కడు

GV Prakash : యాక్టర్, మ్యూజిక్ డైరెక్టర్‌గా వరుస ప్రాజెక్టులు.. ఇండియాలోనే ఒక్కడు

NTV Telugu 1 week ago

భారతీయ చిత్రసీమలో సంగీత దర్శకుడిగా, నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జి.వి. ప్రకాష్ కుమార్ ప్రస్తుతం అత్యంత బిజీగా ఉన్న మ్యూజిక్ కంపోజర్లలో టాప్ లో నిలిచాడు జీవీ.

చేతినిండా భారీ ప్రాజెక్ట్‌లతో సంచలన ఫామ్‌లో కొనసాగుతున్నాడు. యంగ్ హీరోల దగ్గరనుండి స్టార్ హీరోల వరకు పాన్ రీజినల్ నుండి పాన్ ఇండియా వరకు అన్ని సినిమాలకు సంగీతం అందిస్తున్నాడు జీవీ.

ప్రస్తుతం జీవీ లైనప్‌లో తమిళ స్టార్ హీరో సూర్య 46వ చిత్రం విశ్వనాధ్ అండ్ సన్స్ తో పాటు దుల్కర్ సల్మాన్ 41వ సినిమా ఆకాశంలో ఒక తార అలాగే శ్రీ శ్రీ, రవితేజ ఇరుముడి, విశాల్ నటిస్తున్న మకుటం ఉన్నాయి. ఘట్టమనేని జై కృష్ణ నటించిన క్రేజీ మూవీ శ్రీనివాస మంగాపురం’ నిన్న థియేటర్స్ లో అడుగు పెట్టింది. జీవీ నేపథ్య సంగీతంకు మంచి మార్కులు వచ్చాయి. అలాగే హాలీవుడ్ బిగ్గెస్ట్ సూపర్ హిట్ ఫ్రాంచైజ్ నుండి వస్తున్నాస్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే యాంతం కూడా జీవీనే సంగీతం అందించి నటించాడు. ఇక నటుడిగా ఇమ్మోర్టల్, మెంటల్ మదిలో వంటి సినిమాలలో నటిస్తున్నాడు. దాంతో పటు తన మొదటి పూర్తి స్థాయి హిందీ ఆల్బమ్ నయీ నవేలీ’ ని కూడా రూపొందిస్తున్నారు. ఒకే సమయంలో సంగీత దర్శకుడిగా స్వరాలు సమకూరుస్తూ, మరోవైపు నటుడిగానూ రాణిస్తూ తన వర్సటైలిటీని చాటుకుంటున్నారు జి.వి. ప్రకాష్. విభిన్నమైన సంగీతంతో అటు సౌత్, ఇటు నార్త్ ప్రేక్షకులను అలరిస్తూ ఇండియన్ మూవీ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరిగా దూసుకెళ్తున్నాడు జీవీ. ఎంటైర్ ఇండియాలో యాక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ ఇలా అన్ని క్రాఫ్ట్స్ లో బిజీగా ఉన్న నటుడు జీవి మాత్రమే.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu