Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Hanuman : మళ్లీ 'హనుమాన్' జాతర.. ఈసారి 3Dలో థియేటర్లు దద్దరిల్లడం ఖాయం!

Hanuman : మళ్లీ 'హనుమాన్' జాతర.. ఈసారి 3Dలో థియేటర్లు దద్దరిల్లడం ఖాయం!

NTV Telugu 1 week ago

టాలీవుడ్‌లో చిన్న సినిమాగా విడుదలై గ్లోబల్ స్థాయిలో వసూళ్ల సునామీ సృష్టించిన మూవీ ‘హనుమాన్’. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVC) నుంచి వచ్చిన ఈ తొలి సూపర్ హీరో మూవీ పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది.

జాతీయ అవార్డును గెలుచుకుని తెలుగు సినిమా స్థాయిని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పిన ఈ ఈ విజువల్ వండర్ అభిమానులకు మరో అద్భుతమైన కిక్ ఇచ్చేందుకు రెడీ అయింది. సినిమాలోని అద్భుతమైన గ్రాఫిక్స్, ఎలివేషన్స్, ఎమోషనల్ సీన్స్‌ను మరింతగా ఆస్వాదించేందుకు మేకర్స్ ఈ చిత్రాన్ని ఇప్పుడు 3D ఫార్మాట్‌లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇస్తూ జూన్ 25, 2026న ‘హనుమాన్ 3D’ని వరల్డ్ వైడ్‌గా భారీ స్థాయిలో థియేటర్లలోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు.

“బిగ్ స్క్రీన్‌పై ఈ ఎపిక్‌ను మళ్లీ చూసేందుకు సిద్ధంగా ఉండండి” అంటూ మేకర్స్ ఇచ్చిన అప్‌డేట్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. సూపర్ హీరోగా తేజ సజ్జా అద్భుతమైన నటన, ప్రశాంత్ వర్మ అసాధారణమైన టేకింగ్, గౌరహరి అందించిన గూస్‌బంప్స్ తెప్పించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.. ఇవన్నీ 3Dలో చూస్తుంటే ఆడియన్స్‌కు రోమాలు నిక్కబొడుచుకోవడం ఖాయం, ముఖ్యంగా క్లైమాక్స్. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రంలో అమృతా అయ్యర్ హీరోయిన్‌గా నటించగా వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్ కీలక పాత్రల్లో నటించారు. ఒకసారి ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటిన ఈ ‘హనుమాన్’.. ఇప్పుడు 3D ఫార్మాట్‌లో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu