Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Hardik Pandya-BCCI: హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ భారీ షాక్!

Hardik Pandya-BCCI: హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ భారీ షాక్!

NTV Telugu 3 days ago

Hardik Pandya has been fined by BCCI: ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ భారీ షాక్ ఇచ్చింది. బుధవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించినందుకు హార్దిక్‌పై కఠిన చర్యలు తీసుకుంది.

అతడికి మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా విధించడంతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ కూడా ఇచ్చినట్లు ఐపీఎల్ నిర్వాహకులు ప్రకటించారు. కేకేఆర్ ఇన్నింగ్స్ 10వ ఓవర్ సమయంలో హార్దిక్‌ చేసిన అతి కారణంగా బీసీసీఐ చర్యలు తీసుకుంది.

బౌలింగ్‌కు సిద్ధమవుతూ తన రన్‌అప్ వైపు వెళ్తున్న సమయంలో హార్దిక్ పాండ్యా కోపంతో వికెట్‌పై ఉన్న బెయిల్స్‌ను బలంగా కొట్టేశాడు. దీనిని ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.2 ఉల్లంఘనగా పరిగణించారు. ఈ ఆర్టికల్ ప్రకారం.. మ్యాచ్ సమయంలో క్రికెట్ సామగ్రి, మైదాన పరికరాలు లేదా ఇతర వస్తువులను దుర్వినియోగం చేయడం నేరంగా పరిగణిస్తారు. హార్దిక్‌పై లెవల్-1 నిబంధనల ప్రకారం అధికారులు చర్యలు తీసుకున్నారు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. కోల్‌కతా నైట్ రైడర్స్ 4 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించి ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 147/8 మాత్రమే చేసింది. అనంతరం కేకేఆర్ లక్ష్యాన్ని 18.5 ఓవర్లలోనే ఛేదించింది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన హార్దిక్ పాండ్యా.. తమ జట్టు మరోసారి ఫీల్డింగ్‌లో విఫలమైందని అంగీకరించాడు. 'మేము బ్యాటింగ్‌లో కనీసం 15-20 పరుగులు తక్కువ చేశాం. పవర్‌ప్లేలో చాలా వికెట్లు కోల్పోయాం. తిలక్ వర్మ, నేను ఇంకొంచెం సేపు క్రీజులో ఉండి భాగస్వామ్యం నిర్మించి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. అయితే ఈ పిచ్ బౌలర్లకు సహకారం అందించడం బాగుంది. ఇప్పుడు ఐపీఎల్ పూర్తిగా బ్యాటర్ల ఆటగా మారుతోంది. బౌలర్లు చాలా నిస్సయంగా ఫీలవుతున్నారు' అని హార్దిక్ చెప్పాడు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu