Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హరీష్ రావు అగ్గిపెట్టె మర్చిపోవటం డ్రామా కాదా?: ఎమ్మెల్యే రఘునందన్

హరీష్ రావు అగ్గిపెట్టె మర్చిపోవటం డ్రామా కాదా?: ఎమ్మెల్యే రఘునందన్

NTV Telugu 5 years ago

ఈటల రాజేందర్ కాలు ఆపరేషన్ పై దిగజారి మాట్లాడటాన్ని హరీష్ రావు విజ్ఞతకే వదిలేస్తామని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలిపారు. డ్రామాలకు పర్యాయ పదం కేసీఆర్ కుటుంబం.. సినీ నటుల కంటే గొప్పనటులు కేసీఆర్, హరీష్ రావులని ఆయన విమర్శలు చేశారు. అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ.. ఎమ్మెల్సీ పదవికి కూడా అర్హహురాలు కాదా? ఉద్యమంలో పాడి కౌషిక్ రెడ్డిది కీలకపాత్రగా కేసీఆర్ భావించినట్లున్నారు. మానవత్వం మరచి వ్యక్తిగత విమర్శలు చేయడం హరీష్ రావుకే చెల్లుతుందన్నారు. హరీష్ రావు డ్రామాలకు శ్రీకాంతాచారి బలైయ్యాడు. పెట్రోల్ కొనుకున్న హరీష్ రావు 50 పైసల అగ్గిపెట్టె మర్చిపోవటం డ్రామాలో భాగం కాదా? హరీష్ రావుది డ్రామా అని తెలియకనే శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకుని కాల్చుకున్నాడు.

నిరాహారదీక్ష ముసుగులో కేసీఆర్ ఖమ్మం ఆసుపత్రిలో జ్యూస్ తాగింది నిజం కాదా? వేరే పార్టీలో ఉంటే కష్టమని ఖమ్మంలో జ్యాస్ ఇచ్చిన డాక్టర్ కు గులాబీ కండువా కప్పలేదా? 2008లో రాజశేఖరరెడ్డిని కలసి కాంగ్రెస్ లో చేరటానికి సిద్ధమైన హరీష్ రావుతో చెప్పించుకునే స్థితిలో మేము లేము. పెద్ద సామాజిక వర్గంగా ఉన్న మాదిగలకు క్యాబినెట్ లో చోటు కల్పించాలని రఘునందన్ కోరారు. రేవంత్ రెడ్డికి పీసీసీ.. కేసీఆర్ ఇప్పించారా? లేదా అనేది కాలమే సమాధానం చెప్తోంది. పార్లమెంట్ సమావేశాలు, కిషన్ రెడ్డి యాత్ర కారణంగానే బండి సంజయ్ పాదయాత్ర వాయిదా వేశామని రఘునందన్ తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu