హాలీవుడ్ చరిత్రలోనే అత్యంత ప్రజాదరణ పొందిన లార్జర్-ద్యాన్-లైఫ్ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం 'హీ-మ్యాన్ అండ్ ది మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్' (He-Man and the Masters of the Universe) ఇప్పుడు సరికొత్త హంగులతో భారతీయ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.
ఇప్పటికే విడుదలైన ఇంగ్లీష్ ట్రైలర్ గ్లోబల్ వైడ్‌గా భారీ హైప్ క్రియేట్ చేయగా, తాజాగా విడుదలైన ఈ చిత్ర అఫీషియల్ తెలుగు ట్రైలర్ టాలీవుడ్ ఆడియన్స్‌కు ఒక అదిరిపోయే క్రేజీ సర్ప్రైజ్ ఇచ్చింది.
అయితే హాలీవుడ్ సూపర్ హీరో చిత్రాలకు తెలుగులో టాలీవుడ్ స్టార్స్ వాయిస్ ఓవర్ ఇస్తే ఆ ఇంపాక్ట్ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు అదే మ్యాజిక్ 'హీ-మ్యాన్' చిత్రానికి రిపీట్ కాబోతోంది. ఈ సినిమాలో వీరుడు 'హీ-మ్యాన్' పాత్రకు టాలీవుడ్ యంగ్ అండ్ వర్సటైల్ హీరో, 'కార్తికేయ 2' ఫేమ్ నిఖిల్ సిద్ధార్థ (Nikhil Siddharth) తెలుగులో తన పవర్‌ఫుల్ వాయిస్ అందించారు. నిఖిల్ మార్క్ బేస్ అండ్ ఎనర్జీ ఈ హాలీవుడ్ క్యారెక్టర్‌కు పక్కాగా సెట్ అయ్యింది. కేవలం హీరో పాత్రకే కాకుండా, ఈ సినిమాలో ఉన్న ఇతర కీలక పాత్రలకు కూడా టాలీవుడ్ టాప్ పర్ఫార్మర్లను రంగంలోకి దించింది సోనీ పిక్చర్స్. హాలీవుడ్ వర్షన్‌లో జారెడ్ లెటో పోషించిన ఈ మోస్ట్ పవర్‌ఫుల్ అండ్ క్రూరమైన విలన్ పాత్రకు తెలుగులో ప్రముఖ నటుడు ఆదిత్య మీనన్ (Aditya Menon) తన గంభీరమైన వాయిస్‌ను అందించారు.

