Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Huawei Nova 16 Series: 200MP కెమెరా, 7000mAh బ్యాటరీతో.. హువావే నోవా 16 సిరీస్‌ రిలీజ్

Huawei Nova 16 Series: 200MP కెమెరా, 7000mAh బ్యాటరీతో.. హువావే నోవా 16 సిరీస్‌ రిలీజ్

NTV Telugu 1 week ago

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ హువావే తన కొత్త నోవా 16 సిరీస్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈ సిరీస్‌లో హువావే నోవా 16 అల్ట్రా, నోవా 16 ప్రో, నోవా 16, నోవా 16z మోడళ్లను పరిచయం చేసింది.

శక్తివంతమైన బ్యాటరీ, ప్రీమియం డిజైన్, అధునాతన కెమెరా ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్‌లు మధ్య-ప్రీమియం సెగ్మెంట్‌లో ఒప్పో రెనో 16, వివో S60 సిరీస్‌లకు గట్టి పోటీ ఇవ్వనున్నాయి.

నోవా 16 అల్ట్రా, నోవా 16 ప్రో ఫీచర్లు

హువావే నోవా 16 అల్ట్రా, నోవా 16 ప్రో స్మార్ట్‌ఫోన్‌లు 6.84 అంగుళాల OLED డిస్‌ప్లేతో వస్తున్నాయి. ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 2856 x 1320 పిక్సెల్స్ రిజల్యూషన్‌కు మద్దతు ఇస్తుంది. గ్లాస్ బ్యాక్ డిజైన్‌తో వచ్చిన ఈ ఫోన్‌లు హార్మొనీ OS 6.1 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తాయి. ఈ రెండు మోడళ్లలో కిరిన్ 9010S ప్రాసెసర్‌ను అమర్చారు. అలాగే 7000mAh భారీ బ్యాటరీతో పాటు 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందించారు. నోవా 16 అల్ట్రా మోడల్‌లో అదనంగా 50W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉంది.

200MP కెమెరాతో ఆకట్టుకునే ఫోటోగ్రఫీ

హువావే నోవా 16 అల్ట్రాలో 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంది. దీనితో పాటు 50MP OIS టెలిఫోటో కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ మాక్రో కెమెరా అందించారు. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 50MP ఫ్రంట్ కెమెరాను అమర్చారు. నోవా 16 ప్రోలో కూడా 200MP ప్రధాన కెమెరాతో పాటు 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 50MP అల్ట్రా-వైడ్ మాక్రో కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్‌లో కూడా 50MP సెల్ఫీ కెమెరా లభిస్తుంది.

అదనంగా, ఈ రెండు ఫోన్‌లు శాటిలైట్ కమ్యూనికేషన్ సపోర్ట్, IP68, IP69 వాటర్-అండ్-డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్‌లతో వస్తున్నాయి. కనెక్టివిటీ కోసం Wi-Fi, బ్లూటూత్ 6.0 వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

ధరలు

హువావే నోవా 16 అల్ట్రా ప్రారంభ ధర CNY 4,699 (సుమారు రూ. 66,000)గా నిర్ణయించారు. నోవా 16 ప్రో ప్రారంభ ధర CNY 3,899 (సుమారు రూ. 54,700)గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లు 256GB, 512GB, 1TB స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చాయి. స్టార్రీ బ్లాక్, స్కై బ్లూ, వైట్ కలర్ ఆప్షన్‌లలో వీటిని కొనుగోలు చేయవచ్చు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu