Dailyhunt
Hyderabad: వనస్థలిపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి

Hyderabad: వనస్థలిపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి

NTV Telugu 3 weeks ago

నస్థలిపురం హస్తినాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిని, బైక్ పై వెళ్తున్న మరో ఇద్దరు యువకులను కార్ ఢీకొన్నది.

100 మీటర్ల వరకు ఈడ్చుకెళ్ళి పల్టీ కొట్టింది హోండా సిటీ కార్. బైక్ పై వెళ్తున్న యువకులిద్దరూ మృతి, నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతి చెందిన యువకులిద్దరూ మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్ చెందిన ఈసీఈ రెండవ సంవత్సరం చదువుతున్న, శివ, సందీప్ జోహెల్ గా గుర్తించారు పోలీసులు.

శివ,సందీప్ జోహల్ మృతి చెందారని తెలుసుకున్న తోటి కాలేజీ విద్యార్థులు రోడ్డుపై ఆందోళనకు దిగారు. భారీగా పోలీసులు మోవరించడంతో పోలీసులకు విద్యార్థులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ప్రమాదం చేసిన వ్యక్తిని తమకు అప్పగించాలని విద్యార్థులు రోడ్డుపై ఆందోళనకు దిగారు. పోలీసుల అదుపులో ప్రమాదానికి కారణమైన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu