Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
IBPS PO Recruitment 2026: బ్యాంకింగ్ కెరీర్‌కు గోల్డెన్ ఛాన్స్.. వేల సంఖ్యలో PO పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్..

IBPS PO Recruitment 2026: బ్యాంకింగ్ కెరీర్‌కు గోల్డెన్ ఛాన్స్.. వేల సంఖ్యలో PO పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్..

NTV Telugu 2 weeks ago

బ్యాంకింగ్ రంగంలో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) 2026-27 సంవత్సరానికి ప్రొబేషనరీ ఆఫీసర్ (PO)/మేనేజ్‌మెంట్ ట్రైనీ (MT-XVI) పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.

మొత్తం 6,715 ఖాళీల భర్తీకి రిక్రూట్‌మెంట్ చేపట్టగా, ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా జూలై 21, 2026 వరకు తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ వివరాల కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన తేదీలు

దరఖాస్తుల ప్రారంభం: జూలై 1, 2026
దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 21, 2026
ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: జూలై 21, 2026

మొత్తం ఖాళీలు

ప్రొబేషనరీ ఆఫీసర్ (PO)/మేనేజ్‌మెంట్ ట్రైనీ (MT): 6,715 పోస్టులు

జీతం

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.48,480 నుంచి రూ.85,920 వరకు వేతనం అందిస్తారు.

విద్యార్హత

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు భారతదేశంలోని గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా విద్యాసంస్థ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

వయోపరిమితి

కనీస వయస్సు: 20 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు

వయో సడలింపు

SC/ST అభ్యర్థులకు: 5 సంవత్సరాలు
OBC అభ్యర్థులకు: 3 సంవత్సరాలు
దివ్యాంగులకు (PwBD): 10 సంవత్సరాలు

దరఖాస్తు ఫీజు

SC/ST/PwBD అభ్యర్థులు: రూ.175
జనరల్/OBC/EWS అభ్యర్థులు: రూ.850

ఎంపిక ప్రక్రియ

అభ్యర్థుల ఎంపిక మూడు దశల్లో జరుగుతుంది.

1. ప్రిలిమినరీ పరీక్ష

ప్రిలిమ్స్‌లో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. వీటికి 100 మార్కులు కేటాయించారు.

పరీక్షలో వచ్చే అంశాలు:

ఇంగ్లీష్ లాంగ్వేజ్
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్
రీజనింగ్ ఎబిలిటీ
ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు మెయిన్ పరీక్షకు ఎంపికవుతారు.

2. మెయిన్ పరీక్ష

మెయిన్ పరీక్షలో 170 ప్రశ్నలు, 200 మార్కులు ఉంటాయి. పరీక్ష వ్యవధి 160 నిమిషాలు.

3. ఇంటర్వ్యూ

మెయిన్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. మెయిన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగా తుది మెరిట్ జాబితా విడుదల చేస్తారు.

ఎలా దరఖాస్తు చేయాలి?

అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, అవసరమైన వివరాలు నమోదు చేసి, ఫీజు చెల్లించి దరఖాస్తును సమర్పించాలి. దరఖాస్తు చేసిన తర్వాత భవిష్యత్ అవసరాల కోసం దాని ప్రింట్ కాపీని భద్రపరచుకోవడం మంచిది. బ్యాంకింగ్ రంగంలో కెరీర్‌ను ప్రారంభించాలని భావిస్తున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu