Dailyhunt
Ibrahimpatnam: ఉత్కంఠకు తెర.. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఛైర్మన్ పీఠం ఎవరికి దక్కిందంటే..?

Ibrahimpatnam: ఉత్కంఠకు తెర.. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఛైర్మన్ పీఠం ఎవరికి దక్కిందంటే..?

NTV Telugu 1 week ago

Ibrahimpatnam: గత కొన్ని రోజులుగా ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ వీడింది. ఎట్టకేలకు ఈ మున్సిపాలిటీని భారత్ రాష్ట్ర సమితి(BRS) కైవసం చేసుకుంది.

ఛైర్మన్‌గా బీఆర్ఎస్ అభ్యర్థి టేకుల సుదర్శన్‌రెడ్డి ఎన్నికయ్యారు. వైస్‌ ఛైర్‌పర్సన్‌గా బీజేపీ కౌన్సిలర్‌ ముత్యాల శ్యామలను ఎన్నుకున్నారు. మరోవైపు.. ఈ ఎన్నికలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికను వాయిదా వేయాలని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ 55 రోజులు క్యాంప్ నిర్వహించిందని కాంగ్రెస్ ఆరోపించింది. ముగ్గురు కౌన్సిలర్లపై కోర్టులో కేసు కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్నిక నిర్వహించడం సరైనది కాదని ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. అయితే కోర్టు ఆదేశాల మేరకు ఎన్నిక నిర్వహించామని ఎన్నికల అధికారి స్పష్టం చేశారు. దీంతో ఎన్నికల ప్రక్రియ కొనసాగింది. ఈ ఎన్నికలో భారత్ రాష్ట్ర సమితి(BRS) తరఫున సుదర్శన్ రెడ్డి ఛైర్మన్ అభ్యర్థిగా పోటీ చేయగా, కాంగ్రెస్ తరఫున ఆకుల యాదగిరి పేరును ప్రతిపాదించారు. ఛైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలను చేతులు ఎత్తే విధానంలో నిర్వహించారు. ఎట్టకేలకు బీఆర్ఎస్ ఈ మున్సిపాలిటీని తన ఖాతాలో వేసుకుంది.

READ MORE: Virat Kohli: లండన్‌కి మకాం మార్చిన కోహ్లీ?.. విదేశీ ప్లేయర్ అంటూ ట్రోల్స్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన విరాట్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu