Wednesday, 03 Mar, 11.10 am NTV Telugu

హోమ్
ఇండియా కరోనా అప్డేట్: తగ్గిన పాజిటివ్ కేసులు... మరణాలు

ఇండియా లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. వారం రోజులపాటు 16వేలకు పైగా కేసులు నమోదైన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పుడు ఆ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజా బులెటిన్ ప్రకారం దేశంలో కొత్తగా 14,989కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,11,39,516కి చేరింది. ఇందులో 1,08,12,044 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,70,126 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 98 మంది మృతి చెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 1,57,346కి చేరింది.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: ntvtelugu
Top