Dailyhunt
IPL 2026 Today: నేడు డబుల్ ధమాకా.! ఢిల్లీతో ముంబై ఢీ.. రాజస్థాన్‌తో గుజరాత్ పోరు!

IPL 2026 Today: నేడు డబుల్ ధమాకా.! ఢిల్లీతో ముంబై ఢీ.. రాజస్థాన్‌తో గుజరాత్ పోరు!

NTV Telugu 2 weeks ago

IPL 2026 Today: ఐపీఎల్ 2026 సీజన్‌లో నేడు (ఏప్రిల్ 04) క్రికెట్ అభిమానులకు డబుల్ ధమాకా వినోదం అందనుంది. నేడు జరగనున్న రెండు కీలక పోరుల్లో అగ్రశ్రేణి జట్లు తలపడనున్నాయి.

మొదటి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్‌తో తలపడనుండగా.. రెండో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది.

Yuvraj Singh: "కోహ్లీ ఒక్క మాట కూడా చెప్పలేదు.. ధోనీ క్లారిటీ ఇచ్చాడు".. రిటైర్మెంట్‌పై యువరాజ్ ఎమోషనల్..

ఢిల్లీ క్యాపిటల్స్ vs ముంబై ఇండియన్స్:
మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌ కు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక కానుంది. సొంత గడ్డపై ఆడుతుండటం ఢిల్లీకి కలిసొచ్చే అంశం కాగా, స్టార్ ఆటగాళ్లతో నిండిన ముంబై ఇండియన్స్ వారికి గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మెరుగుపరుచుకోవాలంటే ఈ మ్యాచ్ రెండు జట్లకూ ఎంతో కీలకంగా మారనుంది. ఇప్పటికే ఈ సీజన్ లో ఈ రెండు జట్లు వారి మొదటి మ్యాచ్ లను గెలిచాయి.

SSC Exams 2026: హిందీలో 2.. ఇంగ్లిష్‌లో 5.. పదో తరగతి ప్రశ్నపత్రాల్లో పొరపాట్లకు మార్కుల యాడింగ్.?

గుజరాత్ టైటాన్స్ vs రాజస్థాన్ రాయల్స్:
రాత్రి 3:30 గంటలకు జరగనున్న రెండో మ్యాచ్‌ లో అహ్మదాబాద్‌ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్‌ ను ఎదుర్కోనుంది. హోమ్ గ్రౌండ్‌ లో గుజరాత్‌ కు తిరుగులేని రికార్డు ఉంది. కానీ రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్రస్తుత ఫామ్ దృష్ట్యా ఈ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగే అవకాశం ఉంది. స్పిన్నర్లకు అనుకూలించే ఈ పిచ్‌ పై రాజస్థాన్ స్పిన్ ద్వయం ఎలా రాణిస్తుందో చూడాలి. ఇక ఈ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ మొదటి మ్యాచ్ లో భారీ విజయాన్ని నమోదు చేసుకోగా, గుజరాత్ టైటాన్స్ మాత్రం పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఓడిపోయింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu