Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Iran: మసీదుల్లో ఆయుధ శిక్షణ.. 3 కోట్ల మంది పేర్లు నమోదు..

Iran: మసీదుల్లో ఆయుధ శిక్షణ.. 3 కోట్ల మంది పేర్లు నమోదు..

NTV Telugu 1 week ago

Iran: అమెరికా, ఇజ్రాయిల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ తన సొంత ప్రజలకు ఆయుధ శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించింది. దేశవ్యాప్తంగా మసీదుల్లో పురుషులు, స్త్రీలకు తేలికపాటి ఆయుధాల శిక్షణ పొందుతున్న వీడియోలను ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్రసారం చేసింది.

జాతీయ రక్షణ కోసం ఇలా శిక్షణ ఇస్తున్నట్లు ఇరాన్ ప్రకటించుకుంది. దీని కోసం ఇప్పటి వరకు 3.1 కోట్ల మందికి పైగా పేర్లు నమోదు చేసుకున్నట్లు ప్రభుత్వ టెలివిజన్ చెప్పింది.

‘ఆపరేషన్ జాన్ ఫిదా బరాయే ఇరాన్’ కోసం రక్షణ చర్యల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలుస్తోంది. అమెరికా, ఇజ్రాయిల్ దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్‌కు మద్దతుగా పౌరులను ఏకం చేయడానికి ఆ దేశ ప్రయత్నిస్తోంది. దేశ ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లో అయినా అలర్ట్‌గా ఉండేందుకు ప్రభుత్వం అహ్వాజ్, కెర్మాన్, బిజార్, షిరాజ్, జాహెదాన్ వంటి నగరాల్లోని మసీదులను శిక్షణా కేంద్రాలుగా మార్చింది. తేలికపాటి ఆయుధాలను ఉపయోగించడాన్ని నేర్పిస్తున్నారు. ఈ శిక్షణా కార్యక్రమంలో అనేక కుటుంబాలు కూడా పాల్గొంటున్నాయి. టీనేజర్లు కూడా శిక్షణ తీసుకుంటున్న ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu