Dailyhunt
Iran War: వ్యూహం మార్చిన ఇరాన్.. భయంలో గల్ఫ్ దేశాలు..

Iran War: వ్యూహం మార్చిన ఇరాన్.. భయంలో గల్ఫ్ దేశాలు..

NTV Telugu 1 week ago

Iran War: పశ్చిమాసియాలో యుద్ధం తగ్గడం లేదు. అమెరికా-ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం నెల రోజుల తర్వాత కూడా తీవ్రం అవుతోంది. తాజాగా ఇరాన్ తన వ్యూహాన్ని మార్చినట్లు కనిపిస్తోంది.

ఇన్నాళ్లు గల్ఫ్ దేశాలైన కువైట్, ఖతార్, బహ్రైయిన్, యూఏఈ, సౌదీ అరేబియాల్లోని ఆయిల్, గ్యాస్ కంపెనీలపై విరుచుకుపడిన ఇరాన్ ఇప్పుడు రూల్ మార్చింది. నీరు, గ్యాస్ ప్లాంట్లపై దాడులు ప్రారంభించింది.

Curd Rice vs Dal Rice: పెరుగు అన్నం వర్సెస్‌ పప్పు అన్నం.. ఆరోగ్యానికి ఏది మంచిది..?

అబుదాబిలోని హబ్షాన్ గ్యాస్ కేంద్రం సమీపంలో జరిగిన దాడిని వాయు రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయి, కానీ వీటి శిథిలాలు పడి మంటలు అంటుకున్నాయి. అధికారులు ప్లాంట్‌ను తాత్కాలికంగా మూసేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కువైట్‌లోని ప్రధాన నీటి శుద్ధి కార్మాగారంపై ఇరాన్ దాడి చేసింది. ఇది కువైట్‌కు చాలా కీలకమైన ప్లాంట్. ఆ దేశ ప్రజలకు కావాల్సిన 90 శాతం నీరు ఈ ప్లాంట్ నుంచే వస్తుంది. దీంతో ఆ దేశంలోని ప్రజల నీటి అవసరాలు ప్రశ్నార్థకంగా మారింది.

కువైట్‌లోని మినా అల్ అహ్మది చమురు శుద్ధి కర్మాగారంపై ఇరాన్ డ్రోన్ దాడులు చేసింది. దీని వల్ల మంటలు చెలరేగాయి. మరోవైపు, ఇరాన్ దాడుల కారణంగా బహ్రైయిన్ అంతటా సైరన్లు మోగాయి. పలు డ్రోన్లను కూల్చివేసినట్లు సౌదీ అరేబియా ప్రకటించింది. ఇదే సమయంలో యూఏఈ తన ఎయిర్ డిఫెన్స్‌ను యాక్టివేట్ చేసింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu