Dailyhunt
Iran-Israel: ట్రంప్ వ్యాఖ్యలతో మళ్లీ టెన్షన్.. ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడులు

Iran-Israel: ట్రంప్ వ్యాఖ్యలతో మళ్లీ టెన్షన్.. ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడులు

NTV Telugu 0 months ago

రాన్‌ అంతు చూస్తామంటూ అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రసంగం తర్వాత ప్రపంచ వ్యాప్తంగా మరింత ఉద్రిక్తతలు పెరిగాయి. గురువారం అమెరికా ప్రజలను ఉద్దేశించి ట్రంప్ కీలక ప్రసంగం చేశారు.

2, 3 వారాల్లో ఇరాన్ అంతు చూస్తామంటూ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. అలా ట్రంప్ హెచ్చరించారో లేదో ఇరాన్ ప్రతీకారంతో రగిలిపోతుంది.

ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ క్షిపణులు ప్రయోగించింది. ఇజ్రాయెల్‌లోని ప్రధాన లక్ష్యాలను టార్గెట్‌ చేసుకుని పలు క్షిపణులను ప్రయోగించింది. దీంతో ఇజ్రాయెల్ దళాలు ఐరన్ డ్రోమ్‌తో క్షిపణులను అడ్డుకుంటున్నారు. ప్రస్తుతం పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.

ఇది కూడా చదవండి:Gold Rates: మగువలకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

గురువారం ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్‌పై ఇప్పటి వరకు చేసిన ఆపరేషన్ చాలా స్వల్పం అని.. రెండు, మూడు వారాల్లో మరింత కఠినంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇదంతా అమెరికా భవిష్యత్ తరాల కోసమే యుద్ధం చేస్తున్నట్లుగా ప్రకటించారు. గల్ఫ్ దేశాలకు ఏదైనా జరిగితే.. అవసరమైన మేరలో కాపాడుకుంటామని ట్రంప్ హామీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి:Stock market: ట్రంప్ వార్ వ్యాఖ్యల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu