Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Irumudi OTT : 'ఇరుముడి' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

Irumudi OTT : 'ఇరుముడి' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

NTV Telugu 3 weeks ago

Irumudi OTT : మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన 'ఇరుముడి' సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ స్ట్రీమింగ్‌పై తాజాగా కీలక అప్‌డేట్ వచ్చింది.

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం 'ఇరుముడి' సినిమా సెప్టెంబర్ 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని జోరుగా ప్రచారం జరుగుతుంది. దీంతో థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీలో చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించగా, సాయికుమార్, బేబీ నక్షత్ర, స్వాసిక తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమా కథ, యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సెప్టెంబర్ 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో 'ఇరుముడి' స్ట్రీమింగ్ కానున్నట్లు వస్తున్న ఈ అప్‌డేట్‌తో రవితేజ అభిమానుల్లో సందడి మొదలైంది.

ఇరుముడి కథ

త్రినాథ్ (రవితేజ) సీలేరు ప్రాంతంలోని పోలూరు అనే ఒక పల్లెలో ట్రక్ ఆటో నడుపుకుంటూ అరటి వ్యవసాయం చేసుకునే వ్యక్తి. అక్కడే అతనికి రెండు ఎకరాల అరటి తోట ఉంటుంది. తన కుమార్తె మణికంఠ /మణెమ్మే(నక్షత్ర) లోకంగా బతుకుతున్న అతను, తమ ఊరిలో ఐదో తరగతి తర్వాత స్కూల్ లేదని ఆమెను స్కూల్ మాన్పించడానికి కూడా సిద్ధమవుతాడు. అంతలా ప్రాణానికి ప్రాణంగా తన కుమార్తెను చూసుకుంటూ, ఊరి వాళ్ళతో చాలా సఖ్యతతో ఉంటాడు. అనునిత్యం మద్యం తాగుతూ ఉండే త్రినాథ్, కార్తీక మాసంలో అయ్యప్ప మాల ధరించి ఆ 41 రోజులు మాత్రం చాలా నిష్ఠగా పూజలు చేస్తాడు. తన కుమార్తెకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయ్యప్ప స్వామి చూసుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఏటా అయ్యప్ప మాల ధరిస్తూ ఉంటాడు. ఇక తన ఊరిలో ఏ ఆడపిల్లకు కష్టం వచ్చినా, ఆ ఆడపిల్లని తన కుమార్తెగా భావించి ఆ కష్టానికి అడ్డు నిలబడే ప్రయత్నం చేస్తుంటాడు. ఈ క్రమంలో అనుకోకుండా తమ గురుస్వామి (సాయికుమార్) కుమార్తె గాయత్రి ఒకరోజు మిస్ అవుతుంది. అయితే అసలు గాయత్రికి ఏమైంది? ఆమెను ఊరి వారంతా త్రినాథ్ సహాయంతో కనిపెట్టారా లేదా? అసలు ఆ ఊరిని వెంటాడుతున్న సమస్య ఏమిటి? లాంటి విషయాలు తెలియాలంటే సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu