Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
IT to Auto-driver: ఐటీ ఉద్యోగం వదిలి ఆటోడ్రైవర్‌గా మారి.. ఒక మహిళ కథ వైరల్..

IT to Auto-driver: ఐటీ ఉద్యోగం వదిలి ఆటోడ్రైవర్‌గా మారి.. ఒక మహిళ కథ వైరల్..

NTV Telugu 1 week ago

IT to Auto-driver: ఐటీ ఉద్యోగం, సాఫ్ట్‌వేర్ జాబ్ అంటే సమాజంలో ఒక గౌరవం. ఇది ఎంతలా పెరిగిందంటే అబ్బాయి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయితేనే పెళ్లి కోసం పిల్లను ఇస్తామనే దాకా వెళ్లింది.

ఐటీ ఉద్యోగికి కోట్ల రూపాయల కట్నం ఇచ్చి పెళ్లిళ్లు చేసేవారు. లక్షల్లో సంపాదన, కార్లు, ఇళ్లు ఇలా ఉండేది ఐటీ ఉద్యోగి వైభోగం. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి. ఐటీ జాబ్ అంటే ఒత్తిడి, డబ్బులు వస్తున్న ప్రశాంతత లేని జీవితం, నిత్యం టార్గెట్‌లతో పోరాటం, ఇక ఏఐ వచ్చిన తర్వాత ఐటీ జాబ్‌లు ఎప్పుడు పోతాయో తెలియని పరిస్థితి ఏర్పడింది.

ఇలాంటి పరిస్థితుల్లో, ఐటీ మేనేజర్ నుంచి ఆటో డ్రైవర్‌గా మారిన ఒక మహిళ కథ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె తీసుకున్న నిర్ణయంపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. ప్రశాంతమైన జీవితం కోసమే కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలేసిన ఆటో నడపడం ప్రారంభించినట్లు ఆమె వెల్లడించారు. మహిళ స్టోరీని వ్యాపారవేత్త డాక్టర్ నెజ్రిన్ మిధ్లాజ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలో ఆమెతో మాట కలపగా అసలు నిజం తెలిసింది. ఆటో డ్రైవర్లు అంటే మగవాళ్లే అని అనుకునే స్థితితో, ఒక మహిళ ఆటో డ్రైవర్‌గా ఎలా మారిందనే విషయం తెలుసుకోవాలకున్న సందర్భంలో ఆమె తన ఐటీ ఉద్యోగం, తన జీవిత ప్రయాణాన్ని వివరించింది.

తాను దాదాపుగా 9 ఏళ్ల పాటు ఐటీ జాబ్ చేశానని, అయితే ఉద్యోగంలో ఒత్తిడి, టెన్షన్‌తో విసిగిపోయి ఆ ఉద్యోగాన్ని వదిలేసినట్లు మహిళ చెప్పారు. ఆ తర్వాత సొంతగా ఆటో కొనుగోలు చేసి నడపడం ప్రారంభించినట్లు వెల్లడించారు. తాను ఆటో నడపడం వల్ల ప్రతీ నెల రూ. 60 వేలు సంపాదిస్తున్నానని, దీనికన్నా ముఖ్యంగా మానసిక ప్రశాంతత, సంతోషం లభిస్తున్నాయని చెప్పింది. సంపాదనతో పాటు నచ్చిన జీవితం గడుపుతున్నట్లు చెప్పొకొచ్చారు. చాలా మంది నెటిజన్లు ఆమె నిర్ణయాన్ని అభినందించారు. హోదా, డబ్బు, ప్రతిష్ట కన్నా మనశ్శాంతి చాలా ముఖ్యమని కామెంట్స్ చేస్తున్నారు. పలువురు ఐటీ ఇండస్ట్రీలో కష్టాలను గురించి చెప్పుకున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu