Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్..ఉగ్రవాది హతం

జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్..ఉగ్రవాది హతం

NTV Telugu 5 years ago

జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదుల ఆగడాలకు హద్దు, అదుపు లేకుండా పోతోంది. ఎన్నిసార్లు ఎదురుదెబ్బ తగిలినా...బుద్ధిరావడం లేదు. తాజాగా...జమ్మూకశ్మీర్ లోని బుద్గాం జిల్లాలో ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. క్రార్-ఇ-షరీఫ్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నారన్న సమాచారం తెలిసి నిన్న అర్థరాత్రి నుంచి భద్రతా దళాలు గాలింపు చేపట్టాయి. ఇవాళ ఉదయం ముష్కరులు అనూహ్యంగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా దళాలు సైతం కాల్పులు జరపడంతో ఓ గుర్తు తెలియని ఉగ్రవాది మృతి చెందాడని కశ్మీర్‌ జోన్‌ పోలీసులు ట్వీట్టర్‌ వేదికగా తెలిపారు. ఇక్కడ ఇంకా ఎంత మంది ఉగ్రవాదులు దాగి ఉన్నారని తెలియలేదని పేర్కొన్నారు.

ఇంకా ఆపరేషన్‌ కొనసాగుతూనే ఉందని పోలీసులు తెలిపారు. ఎలాగైనా ఉగ్రవాదుల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తామన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu