Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Janhvi Kapoor: 'పెద్ది' అంటే అచ్చియమ్మకు ఇంత ప్రేమా? మెగా సక్సెస్ కోసం ఏడు కొండలు ఎక్కిన జాన్వీ కపూర్! వీడియో వైరల్

Janhvi Kapoor: 'పెద్ది' అంటే అచ్చియమ్మకు ఇంత ప్రేమా? మెగా సక్సెస్ కోసం ఏడు కొండలు ఎక్కిన జాన్వీ కపూర్! వీడియో వైరల్

NTV Telugu 1 week ago

Janhvi Kapoor: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన రూరల్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' నేడు (జూన్ 4, 2026) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చి సంచలనం సృష్టిస్తోంది.

ఈ భారీ చిత్రం విడుదలైన సందర్భంగా.. ఇందులో హీరోయిన్‌గా నటించిన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన సెంటిమెంట్‌ను మరోసారి చాటుకున్నారు. కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆమె దర్శించుకున్నారు.

తిరుమల కొండపై జాన్వీ కపూర్ చాలా ప్రశాంతంగా గడిపిన ఒక అన్‌సీన్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ వీడియోలో.. జాన్వీ సాంప్రదాయ దుస్తుల్లో, ఒక అరుగు సాధారణ భక్తురాలిలా కూర్చొని కనిపించారు. తన జీవితంలో ఏ చిన్న ముఖ్యమైన ఘట్టం ఉన్నా, సినిమా రిలీజ్ ఉన్నా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం జాన్వీ కపూర్‌కు తల్లి (అతిలోక సుందరి శ్రీదేవి) నుంచి వచ్చిన అలవాటు. ఈ సారి 'పెద్ది' సినిమా సాధిస్తున్న భారీ ఓపెనింగ్స్, సక్సెస్ నేపథ్యంలో.. ఆమె కాలినడకన అలిపిరి మార్గంలోని మెట్లు ఎక్కి స్వామి వారిని దర్శించుకున్నారు. పెద్ది విషయానికి వస్తే 1980ల నాటి రూరల్ ఆంధ్రప్రదేశ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన 'పెద్ది' చిత్రంలో జాన్వీ కపూర్ 'అచ్చియమ్మ' అనే పల్లెటూరి యువతి పాత్రలో ఒదిగిపోయారు. థియేటర్లలో ఆమె నటనకు, గ్లామర్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రస్తుతం ఈ తిరుమల వీడియోను మెగా ఫ్యాన్స్, జాన్వీ ఫ్యాన్స్ షేర్ చేస్తూ.. సినిమాపై ఆమె చూపిస్తున్న ప్రేమకు, ఆమె నిబద్ధతను, భక్తిభావనను అభినందిస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu