Dailyhunt
Jo Sharma : మా సినిమాలో విలన్ ఎవరో చెబితే లక్ష ప్రైజ్ మనీ!

Jo Sharma : మా సినిమాలో విలన్ ఎవరో చెబితే లక్ష ప్రైజ్ మనీ!

NTV Telugu 5 days ago

ఇండియన్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన మూవీ “M4M (మోటివ్ ఫర్ మర్డర్)”. నటి జో శర్మ ప్రధాన పాత్రలో, దర్శకుడు మోహన్ వడ్లపట్ల తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ M4M (Motive For Murder) మే 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

PVR Inox Pictures ద్వారా విడుదలవుతున్న ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నటి జో శర్మ మీడియాకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. నా డెబ్యూ మూవీ “M4M (మోటివ్ ఫర్ మర్డర్)”. ఈ సినిమా తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో విడుదలవుతోంది. మోహన్ వడ్లపట్ల గారు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నా పాత్ర పేరు ‘రాధ’, నేను ఒక క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా కనిపిస్తాను.

సినిమా ఇంకా రిలీజ్ కాకముందే మాకు 15 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డులు వచ్చాయి. లాస్ ఏంజెల్స్ ఫిలిం ఫెస్టివల్ నుంచి బెస్ట్ ఫిలిం, లండన్ ఫిలిం ఫెస్టివల్ నుంచి బెస్ట్ డైరెక్టర్, న్యూయార్క్ ఫిలిం ఫెస్టివల్ నుంచి బెస్ట్ యాక్ట్రెస్, హాలీవుడ్, శాంటా మోనికా తదితర ఫిలిం ఫెస్టివల్స్‌లో ఉత్తమ నటిగా నాకు, ఉత్తమ దర్శకుడిగా మోహన్ గారికి అవార్డులు వచ్చాయి. ముఖ్యంగా ప్రతిష్టాత్మక ‘కేన్స్’ (Cannes) ఫిల్మ్ ఫెస్టివల్‌లో మా సినిమా గ్లోబల్ ప్రీమియర్ వేశారు. అక్కడ తెలుగు సినిమాను సబ్-టైటిల్స్‌తో చూసిన విదేశీయులు కూడా ఆశ్చర్యపోయి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. అది మాకు దక్కిన చాలా గొప్ప గౌరవం. అక్కడ మా సినిమాకు వచ్చిన స్పందన ఎంతో ఆత్మవిశ్వాసం కలిగింది. ఇది ఒక మర్డర్ మిస్టరీ థ్రిల్లర్. ఇందులో ఒక సీరియల్ కిల్లర్ ఉంటాడు. అతను హత్యలు చేసిన తర్వాత, ఆ మృతదేహాలను రాజా రవివర్మ, పికాసో లాంటి గొప్ప పెయింటర్ల పెయింటింగ్స్ (కళాఖండాల) తరహాలో డెకరేట్ చేస్తాడు. ఇలాంటి కాన్సెప్ట్ ప్రపంచంలోనే ఎక్కడా రాలేదు. ప్రతి సీన్ చాలా గ్రిప్పింగ్‌గా, సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌లా సాగుతుంది. సినిమాలో హీరోగా ఏసీపీ కృష్ణ పాత్ర ఉంటుంది. విడుదల రోజు ఈ సినిమాలో విలన్ ఎవరో చెబితే లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించాము.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu