'మల్లీశ్వరి'లో మహారాణిగా మెప్పించిన కత్రినా కైఫ్ ఇటీవల కోవిడ్ నుంచి కోలుకుని షూటింగ్ లలో పాల్గొంటున్నారు. అయితే బాలీవుడ్ లో కరోనా సెకండ్ వేవ్ తో సినిమాల షూటింగ్స్ అన్నీ బంద్ అయిన నేపథ్యంలో ఏ షూట్ అంటారా... ఓ వ్యాపారప్రకటనలో సందడి చేసింది కత్రినా కైఫ్. ఆ ప్రకటన కళ్యాణ్ జ్యూవెలర్స్ ది కావటం విశేషం. ఈ ప్రకటన తెలుగు వెర్షన్ లో అమితాబ్, నాగార్జున, జయాబచ్చన్, రెజీనా సందడి చేయగా... హిందీ వెర్షన్ లో అబితాబ్, జయాబచ్చన్, కత్రినాకైప్, రెజీనా కసండ్రా, నిధి అగర్వాల్, మంజు వారియర్, రెబా మోనికా జాన్ నటించారు. ఈ ప్రకటన కోసం కత్రినాకైప్, రెజీనా కసండ్రా, నిధి అగర్వాల్, మంజు వారియర్, రెబా మోనికా జాన్ సిస్టర్స్ గా నటించటం విశేషం.

