Dailyhunt
కరోనా అప్డేట్ : అమెరికాను దాటేస్తున్న ఇండియా.!

కరోనా అప్డేట్ : అమెరికాను దాటేస్తున్న ఇండియా.!

NTV Telugu 5 years ago

భారత్ లో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. మిగతా దేశాలతో పోలిస్తే కరోనా కేసులు లేటుగా నమోదైన భారత్ లో కరోనా వ్యాప్తి వేగంగా పెరగటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా రోజూ వారిగా నమోదయ్యే కొత్త కేసులు, మరణాల సంఖ్యలో భారత్ అమెరికా ను దాటేస్తుంది. గత రెండు రోజులుగా నమోదవుతున్న కేసుల్లో అమెరికాను దాటేసింది. సోమవారం నాడు అమెరికాలో 48,622 కేసులు రాగా ఇండియాలో 49,134 కేసులు నమోదయ్యాయి. ఇక మూడవస్థానంలో ఉన్న బ్రెజిల్ లో 17,988 కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్యలో చూస్తే సోమవారం అమెరికాలో 568 మంది మరణించగా ఇండియాలో 874 మంది మృతిచెందారు. మరోవైపు మంగళవారం కూడా కరోనా కేసులు, మరణాల సంఖ్యలో భారత్ మొదటి స్థానానికి చేరుకుంది.

ఇక ఇప్పటివరకు దేశంలో మొత్తం 18,55,746 కేసులు నమోదయ్యాయి. వారిలో 12,30,510 మంది కరోనా నుండి కోలుకున్నారు. ఇక ఇప్పటివరకు కోవిడ్ కారణంగా మొత్తం 38,938 మంది మరణించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu