ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి.. భారత్‌లో ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు.. ఫస్ట్‌వేవ్ కంటే.. సెకండ్ వేవ్ సమయంలో పెద్ద సంఖ్యలో కేసులు వెలుగుచూశాయి..
అన్ని కోవిడ్ అప్డేట్స్ గురించి తెలుసుకునేందుకు ఇక్కడ చదవండి
ఇక, దేశవ్యాప్తంగా కరోనా కట్టడిలో ఇప్పటి వరకు తీసుకున్న చర్యలతో మంచి ఫలితాలను వచ్చాయని.. వాటిని మరింత మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు వీకే పాల్.. మరోవైపు.. వ్యాక్సినేషన్ ప్రక్రియపై మాట్లాడిన ఆయన.. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 20శాతం మందికి రెండు డోసులు వ్యాక్సినేషన్ పూర్తిచేశామని.. 62శాతం మందికి కనీసం ఒక్కడోసు అందినట్టు వెల్లడించారు. ఇక, ఈ సీజన్‌లో వ్యాక్సిన్ తీసుకోవడంతోపాటు.. కోవిడ్ నిబంధనలు పాటించడం, అనవసర ప్రయాణాలు తగ్గించుకోవడం మంచిదన్నారు ఐసీఎంఆర్ డీజీ డాక్టర్ బలరాం భార్గవ.. మరోవైపు, కేరళలో కూడా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని.. ఇతర రాష్ట్రాల్లో కూడా మెరుగైన పరిస్థితి ఉందని.. మరో మూడు నెలలు మాత్రం జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది కేంద్రం.

