Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Karuppu : 'కరుప్పు' సక్సెస్‌పై సూర్య ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

Karuppu : 'కరుప్పు' సక్సెస్‌పై సూర్య ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

NTV Telugu 1 week ago

టుడు – దర్శకుడు ఆర్‌జే బాలాజీ తెరకెక్కించిన 'కరుప్పు' చిత్రం గత శుక్రవారం (మే 15) విడుదలై ప్రపంచవ్యాప్తంగా బ్లాక్‌బస్టర్ టాక్‌ను సొంతం చేసుకుంది.

ఎన్నో ఆర్థిక ఇబ్బందులను తట్టుకుని థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా సూర్య కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో, ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు చూపిస్తున్న అపారమైన ప్రేమకు, థియేటర్లలో లభిస్తున్న అద్భుతమైన రెస్పాన్స్‌కు సూర్య భావోద్వేగానికి లోనవుతూ చిత్ర యూనిట్‌లోని ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.

అయితే ఈ సినిమా సక్సెస్‌పై సూర్య స్పందిస్తూ, ముఖ్యంగా దర్శకుడు ఆర్‌జే బాలాజీపై ప్రశంసల జల్లు కురిపించారు. 'బాలాజీ.. 'మీకు ఒక సాలిడ్ బ్లాక్‌బస్టర్ సినిమా ఇస్తాను సార్' అని నాకు మాట ఇచ్చావు. నువ్వు అన్నట్లుగానే థియేటర్లలో ప్రేక్షకులందరి ప్రేమను, హృదయాలను గెలుచుకుంటూ నీ మాటను నిలబెట్టుకున్నావు. థాంక్యూ బాలాజీ' అంటూ కొనియాడారు. (నిన్ననే థియేటర్ రెస్పాన్స్ చూసి ఆర్‌జే బాలాజీ వెక్కివెక్కి ఏడ్వగా, త్రిష హగ్ చేసుకున్న వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే). సినిమా వెనుక రాత్రింబవళ్లు కష్టపడిన టెక్నీషియన్స్ గురించి సూర్య ఎంతో హృదయపూర్వకంగా రాసుకొచ్చారు. 'తన భార్య బాబుకు జన్మనిచ్చిన ఆనంద క్షణాల్లో కూడా.. హాస్పిటల్ నుండి నేరుగా వచ్చి సినిమా ఎడిటింగ్ టేబుల్ దగ్గర కూర్చుని శ్రమించిన ఎడిటర్ కలైవానన్ అంకితభావానికి నా హ్యాట్సాఫ్' అంటూ సూర్య ప్రత్యేకంగా అభినందించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu