Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Kavitha : నిజామాబాద్ సభలో కవిత కన్నీళ్లు.. ఆ మాటలేంటి.?

Kavitha : నిజామాబాద్ సభలో కవిత కన్నీళ్లు.. ఆ మాటలేంటి.?

NTV Telugu 1 week ago

Kavitha : నిజామాబాద్‌లో నిర్వహించిన తెలంగాణ రక్షణ సేన (TRS) పాంచజన్య సంకల్ప సభకు ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. ఈ సభా వేదికపై తన సొంత నియోజకవర్గ ప్రజలను, అభిమానులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆమె తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు.

తాను ఎంతమాత్రమూ పిరికిదాన్ని కాదని స్పష్టం చేసిన కవిత.. తనపై పెట్టిన అక్రమ కేసుల తీరును ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి తన సచ్చీలతను గుర్తించి కేసును కొట్టివేయడమే కాకుండా, సదరు సీబీఐ అధికారులపైనే చర్యలు తీసుకోవాలని ఆదేశించిన ఉదంతాన్ని ప్రజలకు వివరించారు.

అంతేకాకుండా, సొంత కుటుంబం తనను పార్టీ , రాజకీయాల నుండి బయటకు పంపిన తీరును వివరించే క్రమంలో కవిత మరింత తీవ్ర ఆవేదనకు గురయ్యారు. కష్టకాలంలో తనకు అండగా నిలిచిన ప్రజల ప్రేమాభిమానాలే తన అసలైన బలమని కొనియాడారు. ఎంతటి రాజకీయ పక్షపాతాలు, కుటుంబ విభేదాలు ఎదురైనా ప్రజల హక్కుల సాధన కోసమే తన తదుపరి పోరాటం కొనసాగుతుందని, ఎలాంటి సవాళ్లకైనా వెరవకుండా ముందుకు సాగుతానని సభాముఖంగా కవిత ప్రకటించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu