Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Keralam: మాజీ సీఎం విజయన్‌ను కలిసిన సతీశన్.. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చ

Keralam: మాజీ సీఎం విజయన్‌ను కలిసిన సతీశన్.. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చ

NTV Telugu 1 week ago

కేరళం ముఖ్యమంత్రి పదవికి ఎంపికైన వీడీ సతీశన్.. మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను తిరువనంతపురంలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది.

అలాగే ప్రమాణస్వీకారానికి రావాల్సిందిగా ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. ఈనెల 18న సతీశన్ కేరళం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది.

మే 4న విడుదలైన ఫలితాల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని కూటమి ఘన విజయం సాధించింది. ఇక 10 రోజుల చర్చల తర్వాత వీడీ.సతీశన్‌ను కేరళం ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది. గత 10 ఏళ్ల పాటు సతీశన్ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చేందుకు తీవ్రంగా కృషి చేశారు. ఇప్పుడు పినరయి విజయన్ ప్రతిపక్ష నేతగా ఉండనున్నారు.

ఇక గురువారం రాత్రి లోక్‌భవన్‌లో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌ను సతీశన్ కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరగా.. పూర్తి మద్దతు ఉండడంతో గవర్నర్ ఆహ్వానించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సతీశన్ ఆయా నాయకులను వరుసగా కలుస్తున్నారు. ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణస్వీకారం చేశాక.. మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ కలిశారు. పలువురు నాయకులను కలిసి కొత్త ఒరవడి సృష్టించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu