Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కోవిడ్ వ్యాక్సిన్స్‌.. జీఎంఆర్‌-దుబాయ్‌ ఎయిర్‌పోర్ట్‌ మధ్య ఒప్పందం..

కోవిడ్ వ్యాక్సిన్స్‌.. జీఎంఆర్‌-దుబాయ్‌ ఎయిర్‌పోర్ట్‌ మధ్య ఒప్పందం..

NTV Telugu 5 years ago

హైదరాబాద్ నుంచి కోవిడ్-19 వ్యాక్సిన్ల సరఫరా కోసం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్-దుబాయ్ ఎయిర్‌పోర్ట్ మధ్య కీలక ఒప్పందం జరిగింది.. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ -19 వ్యాక్సిన్లను తరలించే ప్రక్రియలో ఎదురయ్యే రవాణా సమస్యలను పరిష్కరించడంలో మొదటి ప్రయత్నంగా ఈ ఒప్పందం చేసుకున్నారు.. వ్యాక్సిన్ల ఉత్పత్తిలో గ్లోబల్ హబ్ అయిన హైదరాబాద్, గ్లోబల్ ఎయిర్ కార్గో హబ్ అయిన దుబాయ్‌ల ప్రత్యేక భాగస్వామ్యం అయ్యాయి.. కోవిడ్ -19 వ్యాక్సిన్లను ప్రపంచవ్యాప్తంగా సురక్షితంగా, సమర్థవంతంగా తరలించడంలో హైదరాబాద్-దుబాయ్ ఎయిర్ ఫ్రైట్ కారిడార్‌ను గ్లోబల్ గేట్‌వేగా మార్చే ఒప్పందం జరిగింది.. వ్యాక్సిన్ హ్యాండ్లింగ్ సదుపాయాలను జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గో మెరుగుపరుస్తుండగా..

వ్యాక్సిన్ హ్యాండ్లింగ్ సెంటర్‌గా తన ప్రత్యేక స్థానాన్ని ఉపయోగించుకోనుంది దుబాయ్ ఎయిర్ పోర్ట్.

హైదరాబాద్, దాని సమీప ప్రాంతాలు ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ కేంద్రాలలో ఒకటిగా ఉన్నందున, భారత్ నుంచి తయారయ్యే వ్యాక్సిన్లలో ఎక్కువ భాగం హైదరాబాద్ విమానాశ్రయం నుంచి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు ఎగుమతి అవుతుందని భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా తయారీదారుల దిగుమతి అవసరాలను తీర్చడంతో పాటు కోవిడ్ -19 వ్యాక్సిన్ల దేశీయ పంపిణీలో హైదరాబాద్‌ విమానాశ్రయానికున్న కనెక్టివిటీ బాగా ఉపయోగపడుతుంది. ఈ నేపథ్యంలో, జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ మరియు జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గో (జీఎంఆర్-హెచ్‌వైడీ) మరియు దుబాయ్ విమానాశ్రయాలు కలిసి 'HYDXB-VAXCOR' (హైదరాబాద్ - దుబాయ్ గ్లోబల్ వ్యాక్సిన్ కారిడార్) అనే ప్రత్యేకమైన వ్యాక్సిన్ ఎయిర్ ఫ్రైట్ కారిడార్‌ను ఏర్పాటు చేస్తున్నాయి. దీని కోసం రెండు ఎయిర్ట్‌ల అధికారుల మధ్య ఒక వర్చువల్ కార్యక్రమంలో ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం, GMR-HYD మరియు దుబాయ్ విమానాశ్రయాలు 'HYDXB-VAXCOR'లో భాగంగా వివిధ ఖండాలకు రవాణా అయ్యే టెంపరేచర్-సెన్సిటివ్ వ్యాక్సిన్ రవాణాకు ప్రాధాన్యతనిస్తాయి. ఈ ఒప్పందం వల్ల కస్టమైజ్డ్, సరళీకృత ప్రక్రియల ద్వారా కోవిడ్ -19 వ్యాక్సిన్ తయారీ కేంద్రాల నుండి విమానాశ్రయం, అక్కడి నుంచి హబ్ లాజిస్టిక్స్, అటు నుంచి ఎండ్-కస్టమర్లకు వ్యాక్సిన్ల డెలివరీని క్రమబద్ధీకరిస్తారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu