Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Latheesh: ఉప్పు దొంగతనం చేసుకుని తిన్న రోజుల నుంచి టాలీవుడ్ విలన్ దాకా!

Latheesh: ఉప్పు దొంగతనం చేసుకుని తిన్న రోజుల నుంచి టాలీవుడ్ విలన్ దాకా!

NTV Telugu 3 weeks ago

గరికి చెందిన ఒక నిరుపేద వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన లతీష్, ఎన్నో కష్టాలను అనుభవించారు. ఒకానొక దశలో ఉప్పు దొంగతనం చేసి ఆకలి తీర్చుకున్న రోజులు కూడా ఉన్నాయని ఆయన గుర్తుచేసుకున్నారు.

సినిమాల్లోకి వెళ్తున్నాడని తెలిసి తన అన్నయ్య మాట్లాడటం మానేసినప్పటికీ, 'తిమ్మరాజుపల్లి టీవీ'లో పర్ఫామెన్స్ చూసి మళ్లీ మాట్లాడటం తనకు దక్కిన తొలి విజయంగా భావిస్తున్నారు. ఈ ప్రయాణంలో తన అక్క చాముండేశ్వరి, మామ కోటేశ్వరరావు తనకు అండగా నిలిచారని తెలిపారు.

అలాగే.. 'హైదరాబాద్‌ వచ్చి అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో బీ స్టూడియోలో డా. షేక్ జాన్ బషీర్ వద్ద ఉచితంగా నటనలో శిక్షణ పొందాను. అక్కడ వేసిన నాటకాలను చూసి 'తిమ్మరాజుపల్లి టీవీ' టీమ్ ఆడిషన్స్ ద్వారా నను ఎంపిక చేసుకుంది. ఈ సినిమాలో విలన్ 'సిద్ధయ్య' పాత్ర కోసం ఏకంగా 30 కిలోల బరువు పెరిగాను. స్క్రీన్ మీద తన రూపాన్ని చూసి ప్రేక్షకులు గుర్తుపట్టలేనంతగా ఆ పాత్రలో ఒదిగిపోవడం నాకు ఎంతో సంతృప్తిని ఇచ్చింది. సినిమా చూసిన హీరో కిరణ్ అబ్బవరం నా నటనను ప్రత్యేకంగా అభినందించారు. అలాగే నటుడు నరేష్ అగస్త్య కూడా ప్రశంసించారు. అయితే, నా గురువు బషీర్ సార్ ఇన్‌స్టిట్యూట్‌లో అందరి ముందు నా గురించి చెప్పి, హగ్ చేసుకున్న క్షణం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను' అని లతీష్ ఉద్వేగంగా చెప్పారు. ఇక ప్రస్తుతం పలు కొత్త కథలు వింటున్న ఆయన, త్వరలోనే తన తదుపరి ప్రాజెక్టులను ప్రకటించనున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu