Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Mamata Banerjee: హైకోర్టు షాక్.. మమతా బెనర్జీపై ఎఫ్‌ఐఆర్

Mamata Banerjee: హైకోర్టు షాక్.. మమతా బెనర్జీపై ఎఫ్‌ఐఆర్

NTV Telugu 1 week ago

శ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి హైకోర్టు షాకిచ్చింది. హైకోర్టు షరతులను ఉల్లంఘించినందుకు మమతా బెనర్జీపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

టీఎంసీపీ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం కలకత్తా హైకోర్టు విధించిన షరతులను ఉల్లంఘించినందుకు మమతా బెనర్జీపై కోల్‌కతా పోలీసులు శనివారం సుమోటోగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. మమతా బెనర్జీ, తృణమూల్ ఛాత్ర పరిషత్ (TMCP) సమావేశ నిర్వాహకులపై హేస్టింగ్స్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు ఒక అధికారి తెలిపారు.

కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారన్న ఆరోపణలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు చెప్పారు. ఈ ఉల్లంఘనలో ప్రమేయమున్న వారందరి పాత్రను దర్యాప్తు క్రమంలో పరిశీలిస్తామని అన్నారు. శుక్రవారం సెంట్రల్ కోల్‌కతాలోని కేథడ్రల్ రోడ్‌లో జరిగిన సమావేశానికి కోర్టు విధించిన షరతులను పోలీసులు పరిశీలించిన అనంతరం ఈ కేసు నమోదు చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu