Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Mamidikaya Pappucharu: 'మామిడికాయ పప్పుచారు' ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!

Mamidikaya Pappucharu: 'మామిడికాయ పప్పుచారు' ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!

NTV Telugu 1 week ago

Mamidikaya Pappucharu: వేసవి కాలంలో మామిడికాయతో చేసే వంటకాలను బాగా తినడానికి ఇష్టపడుతుంటాము. ఎందుకంటే వేసవి అయిపోతే మళ్లీ మామిడి కాయలు దొరకవు కాబట్టి.

అలాంటి వారికోసం మామిడి కాయలతో చేసే వంటలలో మామిడికాయ పప్పుచారు ఒకటి. మామిడికాయ పులుపు, కందిపప్పు రుచి, వెల్లుల్లి-జీలకర్ర ఫ్లేవర్ కలిసిన ఈ పప్పులుసు వేడి వేడి అన్నంలో నెయ్యితో తింటే ఆ రుచి మాటల్లో చెప్పలేం. ఇంట్లో సులభంగా లభించే పదార్థాలతో ఎంతో కమ్మగా తయారయ్యే ఈ రెసిపీని ఒకసారి ట్రై చేస్తే మళ్లీ మళ్లీ చేయాలనిపిస్తుంది. మరి దీనిం ఎలా తయారు చేయాలో చూసేద్దామా..

కావలసిన పదార్థాలు:
పప్పు ఉడికించడానికి..
* కందిపప్పు - 1 గ్లాస్ (250 గ్రా.)
* ఉల్లిపాయ - 1
* పచ్చిమిర్చి - 2
* టమాటాలు - 2
* పసుపు - 1 టీ స్పూన్
* నీరు - 1½ గ్లాసులు

పప్పుచారు కోసం..
* పుల్లటి మామిడికాయ - 1 (200 గ్రా.)
* ఉల్లిపాయ - 1 (సన్నని ముక్కలుగా కట్ చేసినది)
* నెయ్యి - 1 టీ స్పూన్
* నూనె - 4 టేబుల్ స్పూన్లు
* మెంతులు - కొద్దిగా
* ఆవాలు - 1 టీ స్పూన్
* జీలకర్ర - ½ టీ స్పూన్
* ఎండుమిర్చి - 2
* కరివేపాకు - 3 నుంచి 4 రెమ్మలు
* పసుపు - 1 టీ స్పూన్
* కారం - ¾ టీ స్పూన్
* ఇంగువ - 1 టీ స్పూన్
* ఉప్పు - తగినంత
* వెల్లుల్లి రెబ్బలు - 10
* కొత్తిమీర - కొద్దిగా

తయారీ విధానం:
పప్పు సిద్ధం:
కందిపప్పును శుభ్రంగా కడిగి కనీసం గంటసేపు నానబెట్టాలి. తర్వాత నీటిని వంపేసి మరోసారి కడిగి కుక్కర్‌లో వేయాలి. అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, పసుపు, నీరు వేసి మూత పెట్టి నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.

పప్పుచారు తాలింపు:
ఒక మందపాటి గిన్నెలో నెయ్యి, నూనె వేసి వేడి చేయాలి. తర్వాత మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించాలి. తాలింపు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి.

మామిడికాయ ముక్కలు ఉడికించుకోవడం:
మామిడికాయను తొక్క తీయకుండా పెద్ద ముక్కలుగా కట్ చేయాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత పసుపు, కారం, ఇంగువ, ఉప్పు వేసి కలపాలి. అనంతరం మామిడికాయ ముక్కలు వేసి బాగా కలిపి మూతపెట్టి సన్నని మంటలో ముక్కలు కొద్దిగా మగ్గే అయ్యే వరకు ఉడికించాలి.

పప్పు కలిపే విధానం:
కుక్కర్‌లో ఉడికిన పప్పును మెత్తగా మెదిపి అందులో తగినంత నీరు కలిపి పల్చగా చేసుకోవాలి. ఈ పప్పు మిశ్రమాన్ని మామిడికాయ ఉడుకుతున్న గిన్నెలో పోసి బాగా కలపాలి. రుచి చూసి అవసరమైతే ఉప్పు లేదా కారం సర్దుబాటు చేసుకోవాలి.

వెల్లుల్లి-జీలకర్రతో ప్రత్యేక ఫ్లేవర్:
వెల్లుల్లి రెబ్బలు, జీలకర్రను కలిపి కచ్చాపచ్చాగా దంచుకోవాలి. పప్పుచారుసు మరుగుతున్న సమయంలో ఈ మిశ్రమాన్ని వేసి మరో రెండు నిమిషాలు ఉడికించాలి. దీనివల్ల పప్పుచారుకు అద్భుతమైన రుచి, సువాసన వస్తాయి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే కమ్మని మామిడికాయ పప్పుచారు సిద్ధం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu