Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Mamitha Baiju: చేస్తే అలాంటి సినిమాలే చేయాలి..మమితా బైజు ఎమోషనల్ కామెంట్స్!

Mamitha Baiju: చేస్తే అలాంటి సినిమాలే చేయాలి..మమితా బైజు ఎమోషనల్ కామెంట్స్!

NTV Telugu 5 days ago

సౌత్ సినీ పరిశ్రమలో ప్రస్తుతం మమితా బైజు పేరు ఒక బ్రాండ్‌గా మారుతోంది. గ్లామర్ పాత్రల కంటే కూడా పర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ ఎంచుకుంటూ స్టార్ హీరోల సరసన ల్యాండ్ అవుతోంది.

రాబోయే రోజుల్లో విడుదల కానున్న ఆమె లైనప్ చూస్తే.. సౌత్ బాక్సాఫీస్ వద్ద ఈమె రేంజ్ మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం (Career Journey), తన కెరీర్, ఫ్యాన్స్, ఫ్యూచర్ ప్లాన్స్ గురించి మమితా బైజు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది

'నా అభిమానుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే విభిన్నమైన చిత్రాలను చేయాలన్నదే నా ఏకైక లక్ష్యం. సినిమాల ద్వారా ఒక మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకోవాలని కోరుకుంటున్నాను. నా కెరీర్ ముగిసిన తర్వాత లేదా భవిష్యత్తులో ఎప్పుడైనా నా గతాన్ని, నేను ప్రయాణించిన కాలాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే.. నా ముఖంలో ఒక తెలియని ఆనందం, తృప్తి కలగాలి. అందుకోసమే నేను కథల ఎంపికలో ఇంత జాగ్రత్తగా ఉంటూ నా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాను' అని చెప్పుకొచ్చింది.

ఇక రాబోయే కొద్ది నెలల్లో ఆమె నటించిన మూడు క్రేజీ సినిమాలు.. జననాయకన్ (తెలుగులో 'జన నాయకుడు'), విశ్వనాథ్ అండ్ సన్స్, ఇరండు విధానం.. వంటి మమితా బైజు నటించిన బ్యాక్-టు-బ్యాక్ థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ మూడు సినిమాలు కనుక బాక్సాఫీస్ వద్ద అనుకున్న రేంజ్‌లో క్లిక్ అయితే.. సౌత్ ఇండియాలోనే టాప్ లీగ్ హీరోయిన్ల జాబితాలోకి మమితా చేరడం ఖాయం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu