Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Manchu Manoj : 'ఐక్య' వెనుక ఉన్న అసలు రహస్యం బయటపెట్టిన మనోజ్!

Manchu Manoj : 'ఐక్య' వెనుక ఉన్న అసలు రహస్యం బయటపెట్టిన మనోజ్!

NTV Telugu 5 days ago

టాలీవుడ్‌లో ప్రయోగాత్మక చిత్రాలకు, డిఫరెంట్ కంటెంట్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే రా కింగ్ మంచు మనోజ్.. తన పుట్టినరోజు (మే 20) సందర్భంగా అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్స్ ఇచ్చారు.

మంగళవారం మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన ఆయన, తన కొత్త సినిమాలు, సొంతంగా స్థాపించిన ‘ఐక్య’ ట్రస్ట్, అలాగే తన భార్య మౌనిక రాజకీయ అరంగేట్రంపై అనేక ఆసక్తికరమైన, సంచలన విషయాలను పంచుకున్నారు.

‘ఐక్య’.. నా బిడ్డ లాంటిది!
అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉండి సాయం చేయాలనే సదుద్దేశంతోనే ‘ఐక్య’ ట్రస్ట్‌ను ప్రారంభించినట్లు మనోజ్ వెల్లడించారు. తన కుమారుడు ‘ధైరవ్’, కుమార్తె ‘దేవ సేన’ పేర్లు కలిసొచ్చేలా, అందరూ కలిసికట్టుగా ఉండాలనే ఉద్దేశంతో 'ఐక్య ధైర్య సేనా సమితి' అని నామకరణం చేసినట్లు తెలిపారు. ఈ ట్రస్ట్‌ను తన సొంత బిడ్డలా భావిస్తున్నానని చెప్పారు. ఈ ట్రస్ట్‌కు ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని, వాయిస్ లేని వారికి ఇది వాయిస్‌గా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఫండ్ రైజింగ్ ద్వారా నిధులు సేకరించి సేవ చేస్తామన్నారు. ఈ ట్రస్ట్‌కు సంబంధించిన పూర్తి విధివిధానాలను జూన్ 7న అధికారికంగా ప్రకటించనున్నారు.

భార్య రాజకీయ అరంగేట్రంపై క్లారిటీ
మనోజ్ భార్య భూమా మౌనిక పొలిటికల్ ఎంట్రీపై వస్తున్న వార్తలను ఆయన నిర్ధారించారు. “మేం పుట్టినప్పటి నుంచీ రాజకీయాల్లోనే ఉన్నాం. కొత్తగా రాజకీయాల్లోకి రావడం ఏముంది? వచ్చే ఎన్నికల్లో నా భార్య కచ్చితంగా పోటీ చేస్తారు” అని కుండబద్దలు కొట్టారు. వృత్తిపరమైన జీవితాల్లో ఒకరినొకరు గౌరవించుకుంటామని, ఒకరి నిర్ణయాల్లో మరొకరు జోక్యం చేసుకోబోమని తెలిపారు. అలాగే మౌనిక నేతృత్వంలో నడుస్తున్న 'నమస్తే వరల్డ్' టాయ్స్ బ్రాంచ్‌లను త్వరలో బెంగళూరుతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తరించే ప్లాన్‌లో ఉన్నారని వెల్లడించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu