Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మందుబాబులకు గుడ్‌న్యూస్‌.. ఇక ఎలాంటి ఆంక్షలు లేవు..!

మందుబాబులకు గుడ్‌న్యూస్‌.. ఇక ఎలాంటి ఆంక్షలు లేవు..!

NTV Telugu 5 years ago

కరోనా సమయంలో అష్టకష్టాలు పడిన మందుబాబులకు గుడ్‌న్యూస్.. లాక్‌డౌన్‌ నేపథ్యంలో మద్యం దుకాణాలపై విధించిన ఆంక్షలను ప్రభుత్వం పూర్తిగా ఎత్తివేసింది. దీంతో.. లాక్‌డౌన్‌కు ముందు ఉన్న టైమింగ్‌లో లిక్కర్ అమ్మకాలు కొనసాగనున్నాయి.. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం విక్రయాలు కొనసాగనున్నాయి. మద్యం దుకాణాలపై ఆంక్షలు ఎత్తివేస్తూ రాష్ట్ర ఆబ్కారీ శాఖ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

కరోనా లాక్‌డౌన్ తర్వాత మే 6వ తేదీ నుంచి మద్యం అమ్మకాలు తిరిగి ప్రారంభించారు.. అయితే.. నిబంధనల ప్రకారం.. మొదట. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే మద్యం షాపులకు అనుమతి ఇచ్చారు..

ఇక, జూన్ 1వ తేదీ తర్వాత ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అనుమతిచ్చింది సర్కార్‌.. జులై 2వ తేదీ తర్వాత ఆ సమయాన్ని రాత్రి 9:30 గంటల వరకు పొడిగించింది.. ఇవాళ్టి నుంచి మద్యం దుకాణాలపై ఉన్న ఆంక్షలను పూర్తిగా ఎత్తివేసింది ఎక్సైజ్ శాఖ. కానీ, మాస్క్ ధరించడం, భౌతికదూరం పాటించడం తప్పనిసరి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu