Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
MEGA 158 : 'బాబీ - చిరు' సినిమాకు అన్ని అడ్డంకులు క్లియర్.. షూట్ ఎప్పుడంటే?

MEGA 158 : 'బాబీ - చిరు' సినిమాకు అన్ని అడ్డంకులు క్లియర్.. షూట్ ఎప్పుడంటే?

NTV Telugu 1 week ago

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్‌లో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ Mega158. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు ఈ సరికొత్త ప్రాజెక్ట్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి.

ఎప్పుడో షూట్ స్టార్ట్ కావాల్సిఉండగా నిర్మాతలకు జననాయగన్ రిలీజ్ డిలే కారణంగా ఫైనాన్స్ ఇష్యూస్ రావడంతో వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మే చివరి వారం నుండి ప్రారంభం కానుంది.

ఈ చిత్రాన్ని సంక్రాంతి 2027 కానుకగా థియేటర్లలోకి తీసుకురావడమే లక్ష్యంగా చిత్రబృందం అడుగులు వేస్తోంది. ‘వాల్తేరు వీరయ్య’ కూడా సంక్రాంతి సీజన్‌లోనే వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్ సాధించడంతో అదే సెంటిమెంట్‌ను ఇక్కడ కూడా రిపీట్ చేయాలని దర్శకుడు బాబీ భావిస్తున్నారు. ఇందుకోసం షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులను ఎక్కడా ఆలస్యం కాకుండా అత్యంత వేగంగా పూర్తి చేసేలా పక్కా షెడ్యూల్స్ ప్లాన్ చేశారు. కన్నడ నిర్మాణ సంస్త కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో చిరంజీవి సరసన నేషనల్ అవార్డు విన్నెర్, సీనియర్ నటి ప్రియమణి కథానాయికగా నటిస్తుండటం విశేషం. మెగాస్టార్ భార్యగా ఆమె పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతుందని ఇండస్ట్రీ టాక్. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి మ్యూజికల్ సెన్సేషన్ ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. మెగాస్టార్ మార్క్ మాస్ ఎలిమెంట్స్‌కి థమన్ తన మార్క్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరియు అదిరిపోయే పాటలతో ఏ రేంజ్‌లో హైప్ ఇస్తాడో చూడాలని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మే చివరి వారం నుండి ప్రారంభం కానున్న ఈసినిమాకు సంబంధించి చిరు లుక్ టెస్ట్ ఫోటో షూట్ కూడా ఫినిష్ చేసారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu