Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Mega Family : మెగా ఫ్యామిలీకి DSP దూరం ?

Mega Family : మెగా ఫ్యామిలీకి DSP దూరం ?

NTV Telugu 2 days ago

మెగా హీరోలకు దేవిశ్రీ ప్రసాద్ లెక్కలేనన్ని మ్యూజికల్ హిట్స్ ఇచ్చాడు. ఎన్టీఆర్, మహేష్ వంటి స్టార్స్‌కు దేవిశ్రీ హిట్స్ ఇచ్చినా.. మెగా హీరోలకు ఇచ్చిన క్యాచీ సాంగ్స్ ఎక్కువ.

చిరంజీవి, బాబీ కాంబోలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ సూపర్ హిట్ అయింది. అయితే, ఇదే కాంబోలో రూపొందుతున్న నెక్స్ట్ సినిమాలో దేవిశ్రీని కాదని తమన్‌ను ఎందుకు తీసుకున్నారు? చిరంజీవే కాదు, మెగా హీరోలందరికీ దేవిశ్రీ దూరమయ్యాడా?

మెగా ఫ్యామిలీ హీరోలతో ఎంతో మంది మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేసినా.. ముందుగా గుర్తొచ్చే పేరు మాత్రం దేవిశ్రీనే. ‘ఆర్య’ నుంచి ‘పుష్ప 2’ వరకు బన్నీ, దేవిశ్రీ కాంబినేషన్‌లో ఏడు సినిమాలు వస్తే, అన్ని మ్యూజికల్ హిట్స్ే. ‘పుష్ప’, ‘పుష్ప2’ కు దేవిశ్రీ ఇచ్చిన ట్యూన్స్ పాన్ ఇండియా హిట్ అవ్వడానికి, అల్లు అర్జున్ ఇమేజ్ పెంచడానికి బాగా ఉపయోగపడ్డాయి. ఈ జనరేషన్ కు తగ్గట్టు హుషారెత్తించే సాంగ్స్ ఇవ్వటంలో దేవిశ్రీ ఎక్స్పర్ట్. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కు క్యాచీ ట్యూన్స్ ఇవ్వలేకపోయినా.. ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’, ‘గబ్బర్ సింగ్’ చిత్రాలను మ్యూజికల్ హిట్స్ చేశాడు దేవిశ్రీ ప్రసాద్.

ఇక దేవిశ్రీ, చిరంజీవి కాంబోలో నాలుగు సినిమాలు వస్తే రెండు సూపర్ హిట్ అయ్యాయి. ముందుగా వచ్చిన ‘శంకర్ దాదా ఎంబిబిఎస్’ కు పాటలు ప్రాణంగా నిలిచాయి. ‘అందరివాడు’, ‘శంకర్ దాదా జిందాబాద్’ ఫ్లాప్ అయినా.. దేవిశ్రీ మాత్రం ఫెయిల్యూర్ కాలేదు. ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత చిరంజీవి, బాబీ కాంబో రిపీట్ అవుతోంది. మరి మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీని కాకుండా తమన్ ను ఎందుకు తీసుకున్నారు? వరుస ఆఫర్స్ ఇచ్చిన మెగా హీరోలు దేవిశ్రీని ఎందుకు పట్టించుకోవడం లేదు?

‘పుష్ప2’ తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న ‘రాక్షస’కు సాయి అభ్యంకర్ మ్యూజిక్ ఇస్తున్నాడు. ‘పెద్ది’కి రెహమాన్ మ్యూజిక్ ఇచ్చాడు. కెరీర్ మొదట్లో దేవిశ్రీని ఎంకరేజ్ చేసిన మెగాస్టార్, ఈసారి దేవిశ్రీని రిపీట్ చేయలేదు. ఎందుకు? దేవిశ్రీ ‘ఎల్లమ్మ’ మూవీతో హీరోగా మారాడు. యాక్టర్ గా నెలకు 15 రోజులు డేట్స్ ఇచ్చినా, మిగతా 15 రోజులు మ్యూజిక్ చేస్తానని దేవిశ్రీనే చెప్పాడు. అయితే ‘పుష్ప 2’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ బిజిఎం (BGM) విషయంలో జరిగిన క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా దేవిశ్రీ పై నెగిటివిటీ స్ప్రెడ్ అయింది. ‘పుష్ప 2’ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను శ్యామ్, తమన్ లతో చేయించారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కు దేవిశ్రీ ట్యూన్స్ ఇచ్చినా, తమన్ బ్యాక్ గ్రౌండ్ ఇవ్వాల్సి వచ్చింది. ಇవన్నీ చిరంజీవి సినిమా ఆఫర్ ను పోగొట్టాయా అని అనిపిస్తోంది. ‘గాడ్ ఫాదర్’ మూవీకి తమన్ మ్యూజిక్ ఇచ్చాడు; చిరంజీవితో వర్క్ చేయడం తమన్ కు ఇది రెండోసారి. బాబీ లాస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’ కు కూడా తమనే మ్యూజిక్ ఇవ్వడంతో, మెగా కాంపౌండ్ లోకి మరోసారి ఎంట్రీ ఇవ్వడం తమన్ కు ఈజీ అయింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu