Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
MK Stalin: 'డమ్మీ సీఎం.. రీల్స్ క్రియేటర్'.. విజయ్‌పై స్టాలిన్ తీవ్ర విమర్శలు

MK Stalin: 'డమ్మీ సీఎం.. రీల్స్ క్రియేటర్'.. విజయ్‌పై స్టాలిన్ తీవ్ర విమర్శలు

NTV Telugu 2 weeks ago

MK Stalin: డీఎంకే నేత, ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ తమిళనాడులో సంచలనంగా మారింది. సినీ నటి త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే అభియోగంపై మంగళవారం ఉదయనిధిని పోలీసులు అరెస్ట్ చేశారు.

చివరకు మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో రిలీజ్ చేశారు. తనయుడి అరెస్ట్‌పై డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. సీఎం విజయ్ ఒక అసమర్థ ముఖ్యమంత్రి, అని, డమ్మీ సీఎం, రీల్స్ క్రియేటర్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఉదయనిధి అరెస్ట్ వెనక రాజకీయ దురుద్దేశం ఉందని స్టాలిన్ ఆరోపించారు. కావేజీ జలాల అంశం, కర్ణాటక ప్రతిపాదించిన మేకేదాటు ప్రాజెక్టును అడ్డుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఈ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఈ అరెస్ట్ జరిగిందని అన్నారు. కావేరీ నీటిని తీసుకురాలేదేరి, మేకేదాటు ప్రాజెక్టును అడ్డుకోలేని డమ్మీ సీఎం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రైతులు ఇబ్బందులు పడుతుంటే, మంత్రులు విజయ్ సినిమా చూసి కన్నీరు పెట్టుకుంటున్నారని స్టాలిన్ ఎద్దేవా చేశారు. తమిళనాడులో 'జోకర్ కేబినెట్' నడుస్తోందని వ్యాఖ్యానించారు.

రాష్ట్ర బడ్జెట్ సమావేశాలకు ఒక రోజు ముందు అరెస్ట్ జరగడం వెనక రాజకీయ ఉద్దేశం ఉందని స్టాలిన్ ఆరోపించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రశ్నించే వారిని అరెస్ట్ చేస్తుందని స్టాలిన్ ఆరోపించారు. ఇది 'ఫాసిస్ట్ ప్రభుత్వం'అని అభివర్ణించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మరిచిపోయి విజయ్ ''రీల్స్ క్రియేటర్''లా తిరుగుతున్నారని విమర్శించారు. అహంకారం నాశనానికి దారి తీస్తుందని హెచ్చరించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu