Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Mrunal Thakur: స్టేజ్‌పై మృణాల్ ఠాకుర్‌కు సారీ చెప్పిన హీరో!

Mrunal Thakur: స్టేజ్‌పై మృణాల్ ఠాకుర్‌కు సారీ చెప్పిన హీరో!

NTV Telugu 1 month ago

Mrunal Thakur: టాలీవుడ్ క్లాసిక్ లవ్ స్టోరీ 'సీతా రామం' విడుదలయ్యి ఇన్నేళ్లవుతున్నా, ఆ సినిమాకు సంబంధించిన విశేషాలు ఇప్పటికీ సోషల్ మీడియాలో సందడి చేస్తూనే ఉన్నాయి.

తాజాగా నిర్వహించిన డెకాయిట్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో సుమంత్.. మృణాల్ ఠాకుర్‌కు సారీ చెప్పిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఈ హీరో ఆ హీరోయిన్‌కు ఎందుకు సారీ చెప్పాడో తెలుసా.. 'సీతా రామం' సినిమాలో దుల్కర్ సల్మాన్ హీరోగా, మృణాల్ ఠాకుర్ హీరోయిన్‌గా, సుమంత్, రష్మిక మందన్న కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించిన ఒక సీన్ ఎడిటింగ్‌లో కట్ అవ్వడంపై తాజాగా ఆయన డెకాయిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో స్పందించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశమైంది.

READ ALSO: Telangana: తెలంగాణలో 'నోటిఫైడ్ డిసీజ్'గా క్యాన్సర్.. ఇకపై ప్రతి కేసు నివేదించడం తప్పనిసరి.!

ఈవెంట్ వేదికపై సుమంత్ మాట్లాడుతూ.. ‘క్షమించు మృణాల్ నీ రామ్‌ను నీ దగ్గరి నుంచి తీసుకెళ్లిపోయినందుకు. నిజానికి సీతా రామంలో ఒక సీన్ ఉంది, కానీ ఎడిటింగ్‌లో తప్పని సరిపరిస్థితుల్లో అది తీసేయాల్సి వచ్చింది. దానికి కాంపన్సేషన్‌గా నేను, మా సీస్టర్ నిర్మాతలుగా నీకు డెయికాట్ ఇచ్చాం. ఈ సినిమా కూడా నీకు ఒక మైల్ స్టోన్ సినిమాగా నిలుస్తుంది’ అని అన్నారు. డెకాయిట్ సినిమా విషయానికి వస్తే ఇందులో అడవిశేష్ హీరోగా, మృణాల్ ఠాకుర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. షనీల్ డియో దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ దిగ్గజం అనురాగ్ కశ్యప్ ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తుండగా, ప్రకాష్ రాజ్, సునీల్, అతుల్ కుల్కర్ణి వంటి దిగ్గజ నటులు నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ, ఆమె సోదరుడు సుమంత్ నిర్మించిన ఈ 'పాన్ ఇండియా' చిత్రం ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu