Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Mumbai Indians Captain: తప్పు సరిదిద్దుకుంటున్న ముంబై మేనేజ్‌మెంట్.. రోహిత్ శర్మ చేతుల్లో కొత్త కెప్టెన్ ఎంపిక?

Mumbai Indians Captain: తప్పు సరిదిద్దుకుంటున్న ముంబై మేనేజ్‌మెంట్.. రోహిత్ శర్మ చేతుల్లో కొత్త కెప్టెన్ ఎంపిక?

NTV Telugu 1 week ago

Mumbai Indians Captaincy Change for IPL 2027: ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీల్లో ఒకటైన ముంబై ఇండియన్స్‌ (ఎంఐ)లో భారీ సంక్షోభం నెలకొన్నట్లు నెట్టింట వార్తలు వస్తున్నాయి.

ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాను నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించే అవకాశాలు ఉన్నాయని జాతీయ మీడియాలు తమ కథనాల్లో పేర్కొన్నాయి. అంతేకాదు ఎంఐ మేనేజ్‌మెంట్‌తో సంబంధాలు దెబ్బతినడంతో హార్దిక్ ఫ్రాంచైజీని వీడేందుకు కూడా సిద్ధమవుతున్నాడని సమాచారం. ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై 14 మ్యాచ్‌ల్లో కేవలం 4 విజయాలు మాత్రమే సాధించడం ఈ మార్పులకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.

2024 సీజన్‌కు ముందు రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి.. హార్దిక్ పాండ్యాకు ముంబై మేనేజ్‌మెంట్‌ బాధ్యతలు అప్పగించింది. అప్పటి నుంచి ముంబై తీవ్ర విమర్శలు ఎదుర్కోంటోంది. అభిమానుల నుంచి భారీ వ్యతిరేకత రావడంతో పాటు జట్టు ప్రదర్శన కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఇప్పుడు ముంబై మేనేజ్‌మెంట్ తమ నిర్ణయాన్ని పునఃపరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈసారి కొత్త కెప్టెన్ ఎంపికలో రోహిత్ శర్మ అభిప్రాయానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వనున్నారని సమాచారం. ముంబై తదుపరి కెప్టెన్‌గా ఎవరిని ఎంపిక చేసినా.. ఆ నిర్ణయానికి రోహిత్ మద్దతు తప్పనిసరిగా ఉండనుందని తెలుస్తోంది. గతంలో చేసిన తప్పును మళ్లీ పునరావృతం చేయకూడదని ముంబై యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

రోహిత్ శర్మ మళ్లీ ముంబై కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం మాత్రం లేదని సమాచారం. ‘ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్ రోహిత్ ఆశీర్వాదాలతోనే ఎంపిక అవుతాడు. కానీ రోహిత్ మళ్లీ కెప్టెన్ కాలేడు’ అని భారత మాజీ క్రికెటర్, కోచ్ ఒకరు వెల్లడించినట్లు కథనాలు చెబుతున్నాయి. మరోవైపు హార్దిక్ పాండ్యా భవిష్యత్తుపై కూడా ఆసక్తికర చర్చ సాగుతోంది. కెప్టెన్సీ కోల్పోవడమే కాకుండా.. మేనేజ్‌మెంట్‌తో వ్యక్తిగత సంబంధాలు కూడా బాగా లేవని సమాచారం. అందుకే హార్దిక్ ముంబైని విడిచి వెళ్లాలని ఆలోచిస్తున్నాడని తెలుస్తోంది. ‘మీకు కంపెనీ మేనేజ్‌మెంట్‌తో మంచి సంబంధాలు లేకపోతే అక్కడ పని చేయగలరా?’ అంటూ ఓ మాజీ ఆటగాడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్‌గా ఎవరిని ఎంపిక చేస్తుందన్నదే ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. యువ ఆటగాడిని ఎంపిక చేస్తారా? లేక సీనియర్ భారత స్టార్‌కే బాధ్యతలు అప్పగిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో రేసులో ముందువరసలో ఉన్నాడట. సూర్యకు కూడా రోహిత్ మద్దతు ఉంటుందన్న విషయం తెలిసిందే. గుజరాత్ టైటాన్స్ కోచ్ ఆశిష్ నెహ్రాను కూడా ముంబైకి తీసుకురావచ్చనే ప్రచారం జరిగింది. అయితే మరో ఫ్రాంచైజీ నుంచి నేరుగా కోచ్ లేదా కెప్టెన్‌ను తీసుకురావడం అంత సులభం కాదని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా ముంబైలో మరోసారి భారీ మార్పులు జరగబోతున్నాయనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. హార్దిక్ భవిష్యత్తుపై వచ్చే కొన్ని వారాల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu