Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Naga Chaitanya: తమిళ మాస్ డైరెక్టర్‌తో.. చైతూ కొత్త ప్రాజెక్ట్‌ ఫిక్స్..!

Naga Chaitanya: తమిళ మాస్ డైరెక్టర్‌తో.. చైతూ కొత్త ప్రాజెక్ట్‌ ఫిక్స్..!

NTV Telugu 2 days ago

యువసామ్రాట్ నాగచైతన్య (Naga Chaitanya) ప్రస్తుతం తన కెరీర్‌లోనే బెస్ట్ ఫేజ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన 'తండేల్' (Thandel) చిత్రంతో తన కెరీర్‌లోనే మొదటిసారి రూ.

100 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు. ప్రస్తుతం కార్తీక్ దండు దర్శకత్వంలో 'వృషకర్మ' (Vrushakarma) అనే మైథలాజికల్ అడ్వెంచర్ థ్రిల్లర్‌లో నటిస్తూ బిజీగా ఉన్న చై.. తన తదుపరి చిత్రం కోసం ఒక సీనియర్ తమిళ దర్శకుడితో చర్చలు జరుపుతున్నట్లు ఫిలింనగర్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన వార్త హల్‌చల్ చేస్తోంది.

గతంలో 'పందెం కోడి', 'ఆవారా' వంటి ఇండస్ట్రీ హిట్లను అందించిన కోలీవుడ్ మాస్ డైరెక్టర్ లింగుస్వామి (Lingusamy) దర్శకత్వంలో నాగచైతన్య తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేస్తున్నట్లు గట్టిగా టాక్ వినిపిస్తోంది. అయితే, ఈ కాంబినేషన్ వార్త అక్కినేని అభిమానుల్లో తీవ్ర చర్చకు, కొంత ఆందోళనకు దారితీసింది. ఎందుకంటే ఒకప్పుడు బ్లాక్‌బస్టర్ హిట్స్ ఇచ్చిన లింగుస్వామి ట్రాక్ రికార్డ్ ఇటీవల ఆశించిన స్థాయిలో లేదు. రామ్ పోతినేనితో ఆయన తెలుగు, తమిళ భాషల్లో భారీ అంచనాలతో తెరకెక్కించిన 'ది వారియర్' (The Warriorr) చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. గతంలో నాగచైతన్య మరో తమిళ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు నమ్మి చేసిన 'కస్టడీ' (Custody) సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

దీంతో మళ్లీ ఫామ్‌లో లేని తమిళ దర్శకుడితో రిస్క్ చేయడం అవసరమా? 'తండేల్' తెచ్చిన వంద కోట్ల మార్కెట్‌ను చైతన్య కాపాడుకోవాలి కదా? అంటూ కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనప్పటికీ, ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వార్తలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరి ఈ క్రేజీ కాంబినేషన్ కేవలం రూమర్‌గానే మిగిలిపోతుందా లేక నిజంగానే నాగచైతన్య, లింగుస్వామికి లైన్ ఇస్తారా అనేది తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu