Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Nagarjuna: నాగార్జునకు బర్త్‌డే విషెస్ చెప్పబోయి అడ్డంగా బుక్కైన ప్రగ్యా జైస్వాల్

Nagarjuna: నాగార్జునకు బర్త్‌డే విషెస్ చెప్పబోయి అడ్డంగా బుక్కైన ప్రగ్యా జైస్వాల్

NTV Telugu 3 weeks ago

సోషల్ మీడియాలో సెలబ్రిటీలు చేసే చిన్న చిన్న పొరపాట్లు కొన్నిసార్లు నెట్టింట పెద్ద దుమారాన్నే రేపుతుంటాయి. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ విషయంలో కూడా సరిగ్గా ఇదే జరిగింది.

కింగ్ అక్కినేని నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ నెటిజన్లను విస్మయానికి గురిచేయడమే కాకుండా, పెద్ద ఎత్తున మీమ్స్‌కు దారితీసింది. నాగార్జున బర్త్‌డే సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలిపారు. ఈ క్రమంలోనే హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో నాగార్జున ఫోటోను షేర్ చేస్తూ.. “హ్యాపీ బర్త్‌డే నాగార్జున గారు.. మీ ఎనర్జీ, ఛార్మ్ అద్భుతం” అంటూ మనస్ఫూర్తిగా విషెస్ రాసుకొచ్చింది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది. ఆ పోస్ట్‌కు బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక మంచి సాంగ్‌ను యాడ్ చేయాలనుకున్న ఆమె.. ఇన్‌స్టాగ్రామ్ మ్యూజిక్ లైబ్రరీలో సెర్చ్ చేసి ‘Nagarjuna x Nana Garu Drum’ అనే వైరల్ ఆడియోను సెలెక్ట్ చేసింది. ఆ ఆడియో క్లిప్‌లో అసభ్యకరమైన పదజాలం ఉన్నాయన్న విషయాన్ని ఆమె కానీ, ఆమె సోషల్ మీడియా టీమ్ కానీ గమనించలేదు. నాగార్జున పేరు కనిపించగానే ఏమాత్రం వినకుండా, చెక్ చేసుకోకుండా ఆ పాటను స్టోరీకి జోడించి పోస్ట్ చేసేశారు.

సీనియర్ స్టార్ హీరోకు శుభాకాంక్షలు చెప్పే పోస్ట్‌లో అలాంటి అసభ్యకరమైన ఆడియో రావడంతో చూసిన నెటిజన్లు ఒక్కసారిగా అవాక్కయ్యారు. క్షణాల్లో ఈ స్టోరీ స్క్రీన్‌షాట్లు, స్క్రీన్ రికార్డింగ్‌లు వైరల్‌గా మారాయి. విషయం తెలుసుకున్న ప్రగ్యా జైస్వాల్ వెంటనే ఆ స్టోరీని డిలీట్ చేసి, ఆడియో లేకుండా కేవలం ఫోటో, టెక్స్ట్‌తో కొత్త స్టోరీని రీ-పోస్ట్ చేసింది. ఈ తప్పిదంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్‌కు తెలుగు భాషపై సరైన పట్టు లేకపోవడం వల్లే ఆ పాటలోని పదాలను అర్థం చేసుకోలేకపోయిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. సెలబ్రిటీల అకౌంట్లను మెయింటైన్ చేసే డిజిటల్ లేదా పీఆర్ (PR) టీమ్‌ల అత్యుత్సాహం, నిర్లక్ష్యం వల్లే ఇలాంటి పొరపాట్లు జరుగుతున్నాయని మరికొందరు మండిపడుతున్నారు. కనీసం పోస్ట్ చేసే ముందైనా ఆడియోను ఒకసారి వినకపోవడం ఎంతవరకు సమంజసమని సినీ ప్రియులు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి సున్నితమైన విషయాల్లో ఇతర భాషల నటీనటులు లేదా వారి సోషల్ మీడియా టీమ్‌లు మరింత బాధ్యతగా, జాగ్రత్తగా వ్యవహరించకపోతే అనవసరమైన ట్రోలింగ్‌కు గురికావాల్సి వస్తుందనడానికి ఈ ఘటనే తాజా ఉదాహరణ.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu