Dailyhunt
నవంబర్ 25, బుధవారం దినఫలాలు

నవంబర్ 25, బుధవారం దినఫలాలు

NTV Telugu 5 years ago

మేషం : ఆర్థిక లావాదేవీలయందు సంతృప్తి. సమయస్ఫూర్తిగా వ్యవహరించి ఒక అవకాశాన్ని మీకు అనుకూలంగా మలచుకుంటారు. మీ ఏమరుపాటుతనం వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది. దూర ప్రాంతాల నుంచి ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల జాగ్రత్త అవసరం.
వృషభం : ఓర్పు, పట్టుదలతో శ్రమించి అనుకున్న పనులు పూర్తిచేస్తారు. ఇతరులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదాపడతాయి. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది.
మిథునం : బంధువులతో సత్సంబంధాలు మెరుగుపడతాయి.

చెప్పుడు మాటలకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిదికాదు. వ్యవహార ఒప్పందాల్లో తొందరపాటుతగదు. ప్రముఖులను కలుసుకుంటారు. పెద్దల ఆరోగ్యం విషయంలో సత్వరం స్పందిస్తారు. అప్పుడపుడు మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది.
కర్కాటకం : చేపట్టిన పనులు ఏమాత్రం ముందుకు సాగవు. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమ సమాచారాలు తెలుసుకుంటారు. వృత్తిరీత్యా ఆకస్మికంగా ప్రయాణం చేస్తారు. మీ అవసరాలకు కావలసిన ధనం ఆత్మీయుల ద్వారా సర్దుబాటు కాగలదు. సొంత వ్యాపారం చేయాలనే మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది.
సింహం : ఉద్యోగస్తులు, ఉన్నతాధికారులు కొత్త వ్యక్తుల వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. కుటుంబీకుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. బంధువులను కలుసుకుంటారు. ఇతరులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. ఖర్చులు అధికం. ఎంతో కొంత పొదుపు చేయాలన్న మీ లక్ష్యం నెరవేరదు.
కన్య : ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. కుటుంబంలో సమస్యలు తలెత్తుతాయి. ప్రయాణాలలో కొత్త కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. వాహనయోగం కలదు. వ్యాపారంలో ఒడిదుడుకులు తొలగిపోతాయి. ప్రారంభంలోని చికాకులు క్రమేపీ తొలగుతాయి. ఉద్యోగస్తులకు విధుల్లో అనుకూల పరిస్థితులు కానవస్తాయి.
తుల : వృత్తి వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులు పెద్దగా ఉండవు. ప్రయాణాల్లో తోటివారితో సమస్యలు తలెత్తకుండా వ్యవహరించండి. మీ మాటకు ఇంటాబయట ఆదరణ పెరుగుతుంది. స్త్రీలపై శకునాలు, చుట్టుపక్కల వారి ప్రభావం అధికంగా ఉంటుంది. నిరుద్యోగులకు అవకాశాలు అందినట్టే చేజారిపోతాయి.
వృశ్చికం : కొబ్బరి, పండ్లు, పూల, పానీయ వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది ఉద్యోగ బాధ్యతల్లో పొరపాట్లు సరిదిద్దుకుంటారు. రాబడికి మించిన ఖర్చులు, చెల్లింపుల వల్ల స్వల్ప ఆటుపోట్లు తప్పవు. కొన్ని సంఘటనలు మనస్థిమితం లేకుండా చేస్తాయి. ఫ్లీడర్లకు వైద్య రంగంలోని వారికి ఒత్తిడి పెరుగుతుంది.
ధనస్సు : రాజీ మార్గంలో సమస్యలు పరిష్కరించుకోవాలి. ఉద్యోగస్తులు ఒత్తిడి, ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారంలో లాభాలను అందుకుంటారు. స్త్రీలకు ఒత్తిడి, పనిభారం అధికం కావడం వల్ల కాళ్లు, నడుము, నరాలకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం లోపిస్తుంది.
మకరం : వనసమారాధనలు వేడుకల్లో పాల్గొంటారు. ఉన్నత పదవులు, బాధ్యతలు స్వీకరిస్తారు. మీ గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. ప్రయాణాలు, బ్యాంకు పనులు ఆశించినంత చురుకుగా సాగవు. చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు కొత్త సమస్యలు తలెత్తుతాయి. ఆత్మీయుల సాయంతో ఒక సమస్యను అధికమిస్తారు.
కుంభం : ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలు తప్పవు. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి కలుగుతుంది. వ్యాపారాల అభివృద్ధికి కొత్త పథకాలు అమలు చేస్తారు. ఉద్యోగులకు విధి నిర్వహణలో చికాకులను ఎదుర్కొంటారు. ఓర్పు, పట్టుదలతో శ్రమించిన గాని అనుకున్న పనులు పూర్తికావు.
మీనం : మీ అభిప్రాయాలకు మంచి స్పందన లభిస్తుంది. ఖర్చులు పెరగడంతో అదనపు రాబడికోసం యత్నాలు సాగిస్తారు. దైవ దర్శనాల్లో చికాకు లెదుర్కొంటారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. అధికారులకు బాధ్యతల మార్పు, ఆకస్మిక స్థానచలనం సంభవం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu