Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
NBK 111 : ఫ్యామిలీ మెంబర్స్‌, డాక్టర్స్ మాట బాలయ్య వినడం లేదా?

NBK 111 : ఫ్యామిలీ మెంబర్స్‌, డాక్టర్స్ మాట బాలయ్య వినడం లేదా?

NTV Telugu 4 days ago

బాలయ్య అంతే.. ఒక్కసారి ఫిక్స్ అయితే ఎవరి మాట వినరు. సినిమా పట్ల తనకున్న అంకితభావాన్ని నందమూరి బాలకృష్ణ మరోసారి నిరూపించుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న NBK 111 చిత్రంలో నటిస్తున్నారు.

అయితే ఇటీవల ఈ సినిమా షూటింగ్‌లో బాలకృష్ణ గాయపడటంతో వైద్యులు ఆయనకు విశ్రాంతి తీసుకోమని సూచించారు. కానీ నిర్మాతలకు నష్టం కలగకూడదనే ఉద్దేశంతో బాలయ్య త్వరగా కోలుకుని షూటింగ్‌లో పాల్గొనాలని మేకర్స్ కు చెప్పారని ఫిలింనగర్ సమాచారం.

అయితే పూర్తిగా కోలుకోకుండానే షూటింగ్‌కు వెళ్లవద్దని బాలకృష్ణ కుటుంబ సభ్యులు, వైద్యులు ఆయనను విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ.. హీరో మాత్రం క్రిస్మస్ రేసులోనే నిలవాలని పట్టుదలతో ఉన్నారు. డిసెంబర్ 24న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనేది ఆయన ఆలోచన. ఒకవేళ క్రిస్మస్ మిస్ అయితే వచ్చే ఏడాది సమ్మర్ వరకు ఆగాల్సి వస్తుందని బాలయ్య భావిస్తున్నారు. క్రిస్మస్ మిస్ అయితే సంక్రాంతికి రావడం కూడా కష్టమే, ఎందుకంటే 2025 సంక్రాంతి స్లాట్స్ అన్నీ ఇప్పటికే బుక్ అయిపోయాయి. చిరంజీవి నటించిన కాకా’, వెంకటేష్ సినిమా (జనవరి 12న విడుదల), ప్రశాంత్ వర్మ ‘మహాకాళి’, మరియు రజనీకాంత్ ‘ధర్మన్’ చిత్రాలు సంక్రాంతి బరిలో ఉన్నాయి. ఈ పోటీ కారణంగానే డిసెంబర్ 24 డేట్‌కే లాక్ చేయాలని బాలకృష్ణ భావిస్తున్నారు. నిర్మాతలను కాపాడుకోవడానికి బాలయ్య చూపుతున్న ఈ చొరవపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తుండగా, ఆరోగ్యం జాగ్రత్త అని సలహాలు ఇస్తున్నారు. ఈ సినిమా అధికారిక విడుదల తేదీని సెప్టెంబర్ 6న ప్రకటించనున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu