Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
NBK111 : 'బాలయ్య - నర్గిస్ ఫక్రి' దబిడి.. దిబిడి.. షూటింగ్ ఫినిష్.. టీజర్ ఎప్పుడంటే?

NBK111 : 'బాలయ్య - నర్గిస్ ఫక్రి' దబిడి.. దిబిడి.. షూటింగ్ ఫినిష్.. టీజర్ ఎప్పుడంటే?

NTV Telugu 1 week ago

నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం NBK111 శరవేగంగా షూటింగ్ జరుగుతోంది.నిన్నటితో ఈ చిత్రంలోని ఒక స్పెషల్ సాంగ్ షూటింగ్‌ను చిత్ర యూనిట్ ఫినిష్ చేసారు మేకర్స్.

బాలీవుడ్ హీరోయిన్ నర్గిస్ ఫక్రి బాలయ్య సరసన చిందేసింది. గతంలో బాలయ్య – గోపీచంద్ కాంబినేషన్‌లో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ చిత్రం ఫ్యాన్స్ కు మంచి ట్రీట్ ఇచ్చింది. ఇప్పుడు రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఇక బాలయ్య సినిమాలలో స్పెషల్ సాంగ్స్ కు సెపరేట్ క్రేజ్ ఉంటుంది. దబిడి, దిబిడి సాంగ్ తో ఊపు ఊపేసిన ఈ కాంబో ఇప్పుడు ఈ సినిమాలో కూడా అదే రేంజ్ మాస్ నంబర్‌ను ప్లాన్ చేస్తున్నారు.బాలయ్య మార్క్ స్టెప్పులతో ఈ పాట థియేటర్లను షేక్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. ఈ స్పెషల్ సాంగ్ షూట్ ముగియడంతో తదుపరి షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. త్వరలోనే ముంబైలో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. అక్కడ కొన్ని కీలక యాక్షన్ సీక్వెన్స్‌లు మరియు టాకీ పార్ట్‌ను చిత్రీకరించనున్నారు. అనంతరం జూన్ నెలలో విదేశీ షెడ్యూల్‌ను ప్రారంభించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. షూటింగ్ ఒకవైపు జరుగుతుండగానే మరోవైపు ప్రమోషన్ల విషయంలో కూడా మేకర్స్ వేగం పెంచారు. సినిమా టీజర్‌కు సంబంధించిన ఎడిటింగ్ పనులు ఇప్పటికే ప్రారంభమైనట్లు తెలుస్తోంది. బాలయ్య బర్త్ డే కానుకగా పవర్‌ఫుల్ టీజర్ అప్‌డేట్‌తో అభిమానులను అలరించేందుకు గోపీచంద్ మలినేని టీమ్ రెడీ అవుతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu