Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Nenevaru : రాజేంద్ర ప్రసాద్ సినిమాకి పెరుగుతున్న థియేటర్లు!

Nenevaru : రాజేంద్ర ప్రసాద్ సినిమాకి పెరుగుతున్న థియేటర్లు!

NTV Telugu 2 weeks ago

డా. రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో, సరికొత్త సందేశాత్మక వినోదాత్మక కథాంశంతో తెరకెక్కిన చిత్రం "నేనెవరు?". చిరంజీవి తన్నీరు రూపొందించిన ఈ చిత్రం మే 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలై, ప్రేక్షకాదరణతో ప్రదర్శితమవుతోంది.

‘సరికొండ మల్లిఖార్జున్’ సమర్పణలో అండేకర్ జగదీష్ బాబు, సకినాన భూలక్ష్మి సంయుక్తంగా ఈ సినిమాకి నిర్మించారు. సినిమాకు అన్ని ప్రాంతాల నుండి పాజిటివ్ టాక్ వస్తుందని, రోజురోజుకూ థియేటర్ల సంఖ్య పెరుగుతోందని నిర్మాతలు అత్యంత ఆనందాన్ని వ్యక్తం చేశారు.

నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ హర్షం వ్యక్తం చేస్తూ చిత్ర యూనిట్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఒక మంచి కథతో, సమాజానికి అవసరమైన సందేశంతో వచ్చిన "నేనెవరు?" చిత్రాన్ని ప్రేక్షకులు ఇంతలా ఓన్ చేసుకోవడం సంతోషకరమన్నారు. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు భారీగా తరలివచ్చి థియేటర్లలో సినిమాను ఆదరించడం తనకు మరింత సంతృప్తిని కలిగించిందని తెలిపారు. దర్శకుడు చిరంజీవి తన్నీరు, నిర్మాతలు అండేకర్ జగదీష్ బాబు, సకినాన భూలక్ష్మి సహా చిత్ర బృందానికి ఆయన కంగ్రాట్స్ చెప్పారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu