Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Number 1 All Rounder: ధోనీ, యువీ కాదు. ప్రపంచంలోనే నంబర్ 1 పవర్ హిట్టర్ ఇతడే..

Number 1 All Rounder: ధోనీ, యువీ కాదు. ప్రపంచంలోనే నంబర్ 1 పవర్ హిట్టర్ ఇతడే..

NTV Telugu 4 days ago

ర్ష్‌దీప్ సింగ్ ఇటీవల ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో ప్రపంచంలోని అత్యుత్తమ ఆల్‌రౌండర్లు , అత్యంత శక్తివంతమైన బ్యాటర్ల జాబితాను పంచుకున్నారు. మొదట ఆల్‌రౌండర్ల వివరాల్లోకి వెళ్తే..

ప్రారంభంలో ఆయన దక్షిణాఫ్రికా దిగ్గజం జాక్స్ కల్లిస్‌ను మొదటి స్థానంలో, హార్దిక్ పాండ్యాను రెండో స్థానంలో, కపిల్ దేవ్‌ను మూడో స్థానంలో ఎంచుకున్నారు. అయితే, టీమిండియా మాజీ స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ పేరు మరచిపోయానని గ్రహించిన వెంటనే సరదాగా ఆందోళన చెందుతూ తన జాబితాను సవరించారు.

పంజాబ్‌కు తిరిగి వెళ్లాలి కాబట్టి యువరాజ్‌ను విస్మరించడం కుదరదని నవ్వుతూ, సవరించిన జాబితాలో యువరాజ్ సింగ్‌కు అగ్రస్థానం ఇచ్చారు. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా జాక్స్ కల్లిస్, హార్దిక్ పాండ్యా, కపిల్ దేవ్, బెన్ స్టోక్స్‌లను నిలిపారు. ఈ జాబితాలో భారతదేశానికి చెందిన ముగ్గురు, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ నుంచి చెరో ఒకరు చోటు దక్కించుకున్నారు.

అదే సమయంలో.. ప్రపంచంలోని అత్యంత పవర్ ఫుల్ బ్యాటర్ల జాబితాను కూడా అర్ష్‌దీప్ వెల్లడించారు. ఈ జాబితాలో వెస్టిండీస్ విధ్వంసకర ఓపెనర్ క్రిస్ గేల్‌కు ఆయన మొదటి స్థానం ఇచ్చారు. పంజాబ్ కింగ్స్ జట్టులో గేల్‌తో కలిసి ఆడిన అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ, నెట్స్‌లో గేల్ ఎంతో ప్రశాంతంగా బ్యాటింగ్ చేసేవారని, కానీ మ్యాచ్‌లోకి దిగగానే తొలి బంతి నుంచే ఎంతో సునాయసంగా భారీ సిక్సర్లు బాదేవారని చెప్పారు.

ఈ క్రమంలోనే టీమిండియా దిగ్గజ కెప్టెన్ ఎమ్.ఎస్. ధోనీకి రెండో స్థానం, యువరాజ్ సింగ్‌కు మూడో స్థానం ఇచ్చారు. ఆ తర్వాతి నాలుగు, ఐదు స్థానాల్లో ఆస్ట్రేలియా మాజీ ఆటగాళ్లు మాథ్యూ హేడెన్, ఆండ్రూ సైమండ్స్‌ను ఎంపిక చేశారు. అయితే ఈ ఇద్దరు ఆస్ట్రేలియా ఆటగాళ్లతో తాను కలిసి ఆడలేదని అర్ష్‌దీప్ పేర్కొన్నారు. ఈ రకంగా అర్ష్‌దీప్ సింగ్ ఎంపిక చేసిన రెండు జాబితాలు క్రికెట్ అభిమానుల్లో ఎంతో ఆసక్తిని రేకెత్తించాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu