Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
OG 2: పవన్ కళ్యాణ్ కొత్త లుక్ వైరల్.. 'ఓజీ 2'పై ఒక్క ఫోటోతోనే భారీ హైప్

OG 2: పవన్ కళ్యాణ్ కొత్త లుక్ వైరల్.. 'ఓజీ 2'పై ఒక్క ఫోటోతోనే భారీ హైప్

NTV Telugu 2 weeks ago

OG 2: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ లుక్ సంచలనాన్నే సృష్టిస్తోంది. ‘ఓజీ 2’ మేకర్స్ విడుదల చేసిన ఒకే ఒక్క ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ అభిమానులను ఉత్సాహంలో ముంచెత్తుతోంది.

చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్‌ను ఇంత రిలాక్స్‌డ్‌గా, స్టైలిష్‌గా చూసిన అభిమానులు ఈ లుక్‌ను తెగ ప్రశంసిస్తున్నారు. వైరల్ ఫోటోలో పవన్ కళ్యాణ్ నల్లటి హూడీ ధరించి, గడ్డంతో ఎంతో స్టైలిష్‌గా, కూల్ గా కనిపిస్తున్నారు. అదే సమయంలో స్క్రీన్ ప్రెజెన్స్‌ను గుర్తు చేసే ఇంటెన్స్ లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి వేదికల్లో ఈ ఫోటో వేగంగా వైరల్ అవుతోంది. ఇటీవలి కాలంలో పవన్ కళ్యాణ్‌కు వచ్చిన అత్యంత స్టైలిష్ లుక్‌లలో ఇదొకటిగా అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అభిమానులు ఈ ఫోటోకి ఎడిట్‌లు, అభినందన పోస్టులతో అన్ని ప్లాట్‌ఫామ్‌లను ముంచెత్తారు.

సినిమా ప్రపంచంలో స్టార్ హీరోల లుక్స్‌కు ఎంత ప్రాధాన్యం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వంటి భారీ అభిమాన వర్గం ఉన్న హీరో విషయంలో చిన్న అప్‌డేట్ కూడా పెద్ద సంచలనంగా మారుతుంది. ఇప్పుడు విడుదలైన ఈ ఫోటో కూడా అదే పరిస్థితిని తీసుకొచ్చింది. సినిమా నుంచి ఎలాంటి టీజర్, ట్రైలర్ విడుదల కాకముందే ఒక స్టిల్‌తోనే అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. ఈ లుక్‌లో కనిపిస్తున్న పవన్ కళ్యాణ్‌ను చూసి ‘ఓజీ 2’లో ఆయన పాత్ర మరింత పవర్‌ఫుల్‌గా ఉండబోతుందనే చర్చ కూడా మొదలైంది.

ఇదిలా ఉండగా ‘ఓజీ 2’ ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే వేగంగా సాగుతున్నట్లు సమాచారం. ఈ సీక్వెల్‌ను త్వరలోనే సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి సంగీత దర్శకుడు తమన్ మరోసారి ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ప్రస్తుతం ‘ఓజీ 2’ గురించి అప్ డేట్స్ పరిమితంగానే ఉన్నప్పటికీ, ఒక్క ఫోటోతోనే సినిమా చుట్టూ భారీ హైప్ మొదలవడం పవన్ కళ్యాణ్ స్టార్‌డమ్‌కు నిదర్శనంగా అభిమానులు భావిస్తున్నారు. విడుదలైన ప్రతి చిన్న అప్‌డేట్‌ను పండుగలా జరుపుకునే అభిమానుల ఉత్సాహం చూస్తే, ‘ఓజీ 2’ విడుదల సమయానికి ఈ అంచనాలు మరింత పెరగడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు అందరి దృష్టి చిత్రబృందం విడుదల చేయబోయే తదుపరి అప్‌డేట్‌పైనే నిలిచింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: ntvtelugu