ఓ యువకుడు ఒకే మండపంలో ఇద్దరు అమ్మాయిలకు తాళి కట్టాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్ లోని బేతుల్ జిల్లాలోని కెరియా గ్రామానికి చెందిన సందీప్ అనే యువకుడు తాను చదువుకుంటున్న సమయంలో ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆమెనే వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఆ అమ్మాయి కూడా అతడిని విడిచి బ్రతకలేనంతగా ప్రేమించింది. కాగా ఇటీవల అతడి ప్రేమ వ్యవహారం తెలియని కుటుంబ సభ్యులు సందీప్ కు సంబంధం చూడటం మొదలు పెట్టారు. వారి బంధువుల్లో ఒక అమ్మాయిని అతడికి ఇచ్చి వివాహం చేయాలని నిశ్చయించుకున్నారు. దాంతో కుటుంబ సభ్యులు చూసిన అమ్మాయి కూడా సందీప్ పై మనసు పారేసుకుంది. తానే జీవితం అనుకుంది.

