బీజేపీ రాష్ట్ర నాయకుడు బండి సంజయ్ ఓడిపోతామనే భయం ఇష్టం వచ్చినట్లు మాట్లాడి వెళ్ళాడని..గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు హుందాగా మాట్లాడేవారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. బండి సంజయ్ ఒక్క సీటు గెలవగానే ఎగిరి ఎగిరి పడుతున్నాడని...తెలంగాణ ఉద్యమ కారులను, ఉద్యమం చేసిన మహిళలను అవమానపరుస్తున్నాడని ఫైర్ అయ్యారు. బండి సంజయ్ సంస్కార హీనంగా మాట్లాడుతున్నాడని... మహిళ దినోత్సవం జరుపుకుంటున్న వేళ మహిళలను కించపరిచే విధంగా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. రైతు బంధు, రైతు భీమా, ఉచిత కరెంట్ ఇచ్చినందుకు జైలులో పెడతావ? తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నందుకు జైలులో పెడతారా? అని నిప్పులు చెరిగారు.

